May 21, 2026

Jagan Mohan Reddy Press Meet: హత్యా రాజకీయాలు చేసేదెరు చంద్రబాబూ?

EX CM YS JAGAN

EX CM YS JAGAN

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన తాజా ప్రెస్ మీట్ (Jagan Mohan Reddy Press Meet) తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టార్గెట్‌గా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్ అంటూ జగన్ నిప్పులు చెరిగారు. తమ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు రాజకీయ హత్యలకు బలయ్యారని, తాము బాధితులం అయినప్పటికీ తమపైనే తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలోనే జరిగిన చారిత్రక ఘోరాలను ఈ సందర్భంగా ఆయన ఆధారాలతో సహా ప్రస్తావించారు.

గతంలో తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి గారిని హతమార్చింది టీడీపీ నాయకులేనని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు వైఎస్సార్‌ను పులివెందులకే పరిమితం చేయాలనే రాజకీయ కుట్రతోనే ఈ హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ కేసులోని దోషులను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో దాచి రక్షించారని, మరి క్రిమినల్ బ్రెయిన్ ఎవరిదో ప్రజలే ఆలోచించాలని పిలుపునిచ్చారు. అలాగే వైఎస్ రాజేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయని, చంద్రబాబు అసెంబ్లీలో హెచ్చరించిన కొద్ది రోజులకే ఆ ప్రమాదం జరగడం విస్మయకరమని వ్యాఖ్యానించారు.

వివేకా హత్య కేసు – దస్తగిరి వివాదం

బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన తీరును జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. తానే స్వయంగా హత్య చేశానని టీవీ లైవ్ షోలలో ఒప్పుకున్న దస్తగిరి అనే వ్యక్తి, ఈరోజు పోలీసుల రక్షణతో కార్లలో తిరగడం వెనుక ఉన్న మర్మాన్ని ప్రశ్నించారు. చంద్రబాబుకు, దస్తగిరికి ఒకే లాయర్ లూథ్రా వకాలతు పుచ్చుకోవడం వెనుక ఉన్న క్రిమినల్ నెట్‌వర్క్ ఎవరిదో స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు.

రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం చంద్రబాబు నైజమని జగన్ మండిపడ్డారు. నందమూరి బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటన, ఆ తర్వాత వాచ్‌మెన్ అనుమానాస్పద మృతిని ప్రస్తావిస్తూ అసలైన గన్ కల్చర్ ఎవరిదో ప్రజలకు తెలుసన్నారు. హరికృష్ణ మరణించిన సమయంలో కేటీఆర్‌తో పొత్తుల గురించి మాట్లాడిన చంద్రబాబువి శవ రాజకీయాలు కావా అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ వెన్నుపోటు – వంగవీటి రంగా హత్య

సొంత మామ, రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని లాక్కున్న చరిత్ర చంద్రబాబుదని జగన్ గుర్తుచేశారు. విజయవాడలో పేదల కోసం దీక్ష చేస్తున్న టైగర్ వంగవీటి మోహన రంగాను అర్థరాత్రి నరికి చంపిన ఘటనలో వేళ్లన్నీ బాబు వైపే చూపిస్తున్నాయన్నారు. ఈ కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణబాబుకు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గౌరవించారని ఆరోపించారు.

ఎన్టీఆర్‌పై దాడి చేసిన మల్లెల బాబ్జీ లాడ్జీలో అనుమానాస్పదంగా మరణించడం, జర్నలిస్ట్ పింగళి దశరథ్‌రామ్ హత్య వెనుక కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వ హస్తం ఉందన్నారు. ధర్నాల సమయంలో బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవారని ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకంలో రాశారని పేర్కొన్నారు. జగన్ మంచివాడు కాబట్టే శత్రువులు కూడా ప్రశాంతంగా ఉన్నారని, విలువలతో కూడిన రాజకీయం తమదని జగన్ స్పష్టం చేశారు.

English Version

The recent Jagan Mohan Reddy Press Meet has created a major political storm in Andhra Pradesh. The YSRCP chief launched a scathing attack on TDP leader Chandrababu Naidu, questioning who truly represents the “axe party” and “gun culture” in the state. Jagan emotionalized the press meet by stating that three generations of his family, including his grandfather, father, and uncle, were victims of political conspiracies, yet the opposition is falsely targeting them. He highlighted various historical incidents to expose the alleged criminal politics of the TDP leadership.

Jagan stated that his grandfather, YS Raja Reddy, was murdered under Chandrababu Naidu’s regime in 1998 to restrict YS Rajasekhara Reddy to Pulivendula. He alleged that the culprits were sheltered in the NTR Trust Bhavan by abusing official power. Furthermore, he raised unresolved doubts regarding the tragic helicopter crash of YSR, noting it occurred just days after Naidu made threatening remarks against him in the State Assembly.

Viveka Murder Case and Dastagiri Issue

Addressing the YS Vivekananda Reddy murder case, Jagan questioned how an accused like Dastagiri, who confessed to the crime on live television, is roaming freely with police protection. He pointed out the shocking coincidence that both Chandrababu Naidu and Dastagiri share the same legal counsel, Harish Salve’s associate Luthra, exposing the underlying political nexus.

He criticized Naidu for protecting murderers and harassing the innocent for political gains. Jagan also recalled the past shooting incident at Nandamuri Balakrishna’s residence and the subsequent mysterious death of the watchman, questioning the TDP’s moral ground on gun culture. He accused Naidu of practicing “dead-body politics” by discussing political alliances with KTR during Harikrishna’s funeral.

NTR Betrayal and Vangaveeti Ranga Murder

Jagan reminded the public how Naidu backstabbed his own father-in-law, NT Rama Rao, to usurp the Chief Minister’s post and the TDP party symbol. He strongly highlighted the brutal murder of Vangaveeti Mohana Ranga in Vijayawada during a hunger strike for the poor, noting that the prime accused, Velagapudi Ramakrishna Babu, was later rewarded with a TDP MLA ticket.

He also referenced the mysterious deaths of Mallela Babji, who allegedly attacked NTR, and journalist Pingali Dasarathram, who exposed TDP’s corruption through his magazine. Jagan quoted Daggubati Venkateswara Rao’s book, which claimed Naidu instructed cadres to burn buses during protests. Jagan concluded by stating that his family believes in values and credibility, unlike Naidu’s opportunistic politics.

Hashtags

#JaganPressMeet #APPolitics #YSRCP #ChandrababuNaidu #TDP #YSJagan #YSVivekaCase #VangaveetiRanga #AndhraPradesh #YSRajaReddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *