March 27, 2026

పాక్ గూఢచారిగా శిక్షణ-భారత్ SIMల పంపిణీ

  • భారత్‌కు ముప్పుగా మారిన రాజస్థాన్ యువకుడు

గూఢచారి కథలు సినిమాల్లో చూసినట్లే అనిపించవచ్చు. కానీ, ఈసారి కథ నిజంగా మన దేశంలోనే ప్రారంభమైంది. భారత్ సరిహద్దులు దాటి పాకిస్థాన్ వరకు సాగిన కుట్ర, దేశద్రోహానికి దారితీసిన యువకుడి వ్యవహారం దేశ భద్రతకు ప్రమాదంగా మారింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేసిన వ్యక్తి. భారత్‌కు చెందినవాడే అయినా, విదేశీ శత్రు శక్తుల కోసం పని చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

రాజస్థాన్‌కి చెందిన కాసిం అరెస్ట్

ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గురువారం రాజస్థాన్‌లోని భారత్‌పూర్ జిల్లాకు చెందిన కాసిం అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. కాసిం మేవాట్‌లోని డీగ్ ప్రాంతంలో పట్టుబడ్డాడు. ప్రస్తుతం పోలీసులు అతన్ని రిమాండ్‌లోకి తీసుకున్నారు.

పాకిస్థాన్‌కి ప్రయాణాలు – ISI శిక్షణ

అధికారుల ప్రకారం, కాసిం 2024 ఆగస్టులో ఒకసారి, 2025 మార్చిలో మళ్లీ పాకిస్థాన్‌కి వెళ్లాడు. రెండు ప్రయాణాల కలిపి సుమారు 90 రోజులు అక్కడ గడిపాడు. ఈ సమయంలో, పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI కీలక నాయకుల వద్ద శిక్షణ పొందినట్టు తెలిసింది.

భారత SIM కార్డులు పాక్‌కి పంపిణీ

పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాసిం భారత్‌లోని SIM కార్డులను పాకిస్థాన్‌కి పంపించేవాడు. అక్కడ వాటిని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లు (PIOs) వాడి, WhatsApp ద్వారా భారతీయుల‌తో సంప్రదించి రహస్య సైనిక సమాచారం, ప్రభుత్వ సంబంధిత వివరాలను సేకరించేవారు.

దేశవ్యతిరేక కార్యకలాపాల్లో శ్రద్ధ

కాసిం కేవలం గూఢచారి మాత్రమే కాదు. అతను దేశంలో అనేక మందిన తీవ్రవాద దిశగా మలచినట్టు సమాచారం. అతడి వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. తదుపరి అరెస్టులు జరగే అవకాశం ఉంది. అతడి సోదరుడు, మరో ISI ఏజెంట్, ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

ఒక సమాచారం… చక్కటి బహిర్గతం

2024 సెప్టెంబరులో భారతీయ మొబైల్ నంబర్లు అనుమానాస్పదంగా విదేశీ గూఢచారి సంస్థలు వాడుతున్నట్టు వచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు ప్రారంభమైంది. కాసిం చర్యలు భారతదేశ భద్రతకు తీవ్ర ముప్పుగా ఉన్నాయని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో బహిర్గతం చేయడమే ఇంటెలిజెన్స్ సంస్థల ప్రాధాన్యతగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *