March 23, 2026

ఇరాన్ ‘సర్ప్రైజ్’ క్షిపణి దాడి.. అమెరికా-బ్రిటన్ స్థావరం లక్ష్యం!

Iran special missile

టెహ్రాన్/వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఊహించని మలుపు తిరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమను తక్కువ అంచనా వేశాయని భావిస్తున్న ఇరాన్, తన సైనిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఒక భారీ ‘సర్ప్రైజ్’ దాడికి తెగబడింది. హిందూ మహాసముద్రంలోని అత్యంత కీలకమైన, వ్యూహాత్మక బ్రిటిష్-అమెరికన్ ఉమ్మడి సైనిక స్థావరం డియెగో గార్సియా (Diego Garcia)పై ఇరాన్ రెండు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ పరిణామంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు నాటో (NATO) దేశాలు తీవ్ర ఆందోళనలో పడ్డాయి.

డియెగో గార్సియా: లక్ష్యం ఎందుకు?

డియెగో గార్సియా ప్రపంచ పటంలో చాలా చిన్న ప్రాంతం అయినప్పటికీ, అమెరికా-బ్రిటన్ రక్షణ వ్యవస్థలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. టెహ్రాన్ నుండి సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరంపై దాడి చేయడం ద్వారా, ఇరాన్ తన క్షిపణుల పరిధిని (Range) నిరూపించుకుంది. ఈ దూరం టెహ్రాన్ నుండి రోమ్, ఏథెన్స్, కైరో వంటి నగరాలకు సమానం. అంటే, దక్షిణ ఐరోపా మొత్తం ఇప్పుడు ఇరాన్ క్షిపణుల పరిధిలోకి వచ్చినట్లే. తమ వద్ద ఈ స్థాయి విధ్వంసకర ఆయుధాలు ఉన్నాయని ఇరాన్ ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. ఒక్కసారి ప్రయోగించి ఊహించని షాక్ ఇచ్చింది.

Read This Article Also : గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ కన్ను.. ‘మాకు ఒక్కమాట చెప్పండి సినిమా చూపిస్తాం’! : ఇరాన్

దాడి వెనుక అసలు వ్యూహం:

ఈ దాడి ఊరికే జరగలేదు. ఇరాన్ క్షిపణి స్థావరాలపై బాంబు దాడులు చేయడానికి డియెగో గార్సియాను ఉపయోగించుకోవడానికి బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ వాషింగ్టన్‌కు అనుమతి ఇచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే ఇరాన్ ఈ ప్రతీకార దాడికి దిగింది. తమపై దాడికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న స్థావరంపైనే, తమ వద్ద ఉందని ఎవరికీ తెలియని ఆయుధంతో దాడి చేయడం ద్వారా ఇరాన్ తన పదునైన వ్యూహాన్ని ప్రదర్శించింది.

దాడి ఫలితం – ట్రంప్ విజయోత్సవం:

ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులలో ఒకటి సాంకేతిక లోపంతో ఆకాశంలోనే విఫలమై సముద్రంలో కూలిపోయింది. రెండవ క్షిపణిని అమెరికా యుద్ధనౌక SM-3 ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ ద్వారా విజయవంతంగా కూల్చివేసింది. ఇప్పటికే యుద్ధంలో విజయం సాధించినట్లుగా ప్రకటించుకుంటున్న ట్రంప్‌కు పెద్ద సవాల్ విసిరింది.

మొత్తమ్మీద, ట్రంప్ పంటి కింద రాయిలా మారిన ఇరాన్, రక్షణ వ్యూహాలను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఏం చేయాలన్న దానిపై నాటో దేశాలు తీవ్ర ఆలోచనలో పడ్డాయి. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన ఇప్పుడు మరింత క్లిష్టంగా మారింది.

English Summary:
In a significant and surprising escalation of the West Asia conflict, Iran has reportedly launched two ballistic missiles targeting the strategic British-American joint military base on Diego Garcia in the Indian Ocean. This unprecedented move, occurring just hours after the UK granted the US permission to use the base for potential strikes on Iranian missile sites, has shocked NATO allies. While one Iranian missile failed in flight and the second was intercepted by a US warship’s SM-3 system, leading President Donald Trump to declare victory, the attack demonstrates Iran’s unexpected long-range strike capability of approximately 4,000 km, placing parts of Europe within reach. This development shifts the war’s dynamics, contradicting Trump’s claims of a weakened Iran and highlighting a massive intelligence failure by Western agencies regarding Tehran’s covert arsenal. The conflict now enters a volatile new phase, with NATO urgently deliberating its next steps.

IranMissileAttack #DiegoGarcia #USPolitics #NATO #MiddleEastCrisis #BreakingNews #AndhraPulse #WarAnalysis #Geopolitics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *