- వెనుదిరిగిన విద్యార్థులు, ఉద్యోగులు
- ఇతర దేశాలపూ కూడా
యునైటెడ్ కింగ్డమ్ (UK) ప్రభుత్వం గత కొంతకాలంగా వీసాలపై తీసుకుంటున్న కఠిన విధానాలు వలస దిశలో స్పష్టమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. తాజాగా ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ONS) విడుదల చేసిన 2024 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం, భారతీయ విద్యార్థులు మరియు ఉద్యోగులే యూకేను విడిచిన అతి పెద్ద వలస గ్రూప్‌గా నిలిచారు.
విద్య కోసం వెళ్లి… తిరిగివచ్చిన భారతీయులు
విద్యార్థి వీసాతో యూకేకు వెళ్లిన 37,000 మంది భారతీయులు గతేడాది స్వదేశానికి చేరుకున్నారు. ఉద్యోగాల కోసం వెళ్లిన 18,000 మంది, ఇతర కారణాలతో వెళ్లిన 3,000 మంది భారతీయులు ఆ దేశం నుంచి వెనుదిరిగారు.
చైనీయులు, నైజీరియన్లు కూడా భారీగా
భారతీయుల తర్వాత అత్యధికంగా బ్రిటన్‌ను విడిచిన వారిలో చైనా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు మొత్తం 45,000 మంది చైనీయులు యూకే నుంచి వెళ్లిపోయారు. అనంతరం నైజీరియన్లు (16,000), పాకిస్తానీలు (12,000), అమెరికన్లు (8,000) వెనుదిరిగారు.
యూకే ప్రభుత్వం ఇటీవలే తల్లి, తండ్రి, జీవిత భాగస్వాముల మీద ఆధారిత వీసాలను మరింత కఠినతరం చేసింది. అనేక యూనివర్సిటీలలో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగా, కంపెనీలు కొత్తగా పని వీసాలు ఇవ్వడంలో తగ్గుదల చూపుతున్నాయి.
విద్యార్థులకు వీసాలు కల్పించడంలో కఠినతరం కావడం వల్ల వారి కుటుంబాలపై ఆర్థికభారం పెరిగింది. కొన్ని యూనివర్సిటీలకు సంబంధించిన కోర్సులు కూడా తగ్గింపునకు గురయ్యాయి. ఇదంతా విద్యా వలసలపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
వలస విధానాల పరిశోధకురాలు డా. మేరీ సింక్లియర్ చెప్పినట్లు, విదేశీ విద్యార్థుల వలసను నిరోధించడమే యూకే నెట్ మైగ్రేషన్ తగ్గింపుకు ముఖ్య కారణం. దీని వల్ల విద్యా వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతోంది.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.