- మెజారిటీ కోల్పోయిన అధికార కూటమి
- ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీల ప్రయత్నాలు
టోక్యో: జపాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అధికార పార్టీ పార్లమెంటు విశ్వాసాన్ని కోల్పోయింది. ఆదివారం జరిగిన కీలకమైన పార్లమెంటరీ ఎన్నికల్లో మెజారిటీని నిరూపించుకోలేకపోయింది. దిగువ సభకు 465 స్థానాలుంటే అధికార కూటమి బలం 279 స్థానాల నుంచి 215 స్థానాలకు దిగజారిపోయింది. అధికారం చేజిక్కించుకోవాలంటే కనీసం 233 స్థానాలు అవసరం.15 యేళ్ళ తరువాత ఆ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) కనిష్ట ఫలితాలను రాబట్టింది.
జపాన్‌లో 1955 నుంచీ ఎల్డీపీయే అధికారంలో ఉంటోంది. అయితే ఈ యేడు ఏ పార్టీకి తగినంత మెజారిటీ రాకపోవడంతో జపాన్ కరెన్సీ యెన్ మూడు నెలల కనిష్టానికి పడిపోయింది. తాము అనుకున్న ఫలితాలను సాధించలేక పోయామని అయినా ప్రజా తీర్పును అంగీకరిస్తున్నామని, అయితే ప్రధానిగా తానే కొనసాగుతానని ఆ దేశ ప్రధానిజపాన్ ప్రధాని షిగెరు ఇషిబా స్పష్టం చేశారు.
అధికార కూటమికి తమ ఎల్డీపీయే సారథ్యం వహిస్తుందని, కీలక విధానాలతో ప్రణాళికాబద్ధమైన బడ్జెట్‌ను రూపొందిస్తామని, రాజకీయ సంస్కరణలు కొనసాగిస్తాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటే ప్రతిపక్షాలకు సహకరించడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
ఫ్యూమియో కిషిడా నుంచి ఇషిబా అక్టోబర్ 1న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే వెంటనే సాధారణ ఎన్నికలకు వెళ్లారు. యోషిహికో నోడా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం కాన్‌స్టిట్యూషనల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ (సీడీపీజే) 148 స్థానాలు గెలుచుకుంది. ఇది గతం లో కంటే 50 స్థానాలు అధికం.
అధికార కూటమికి మెజారిటీ రాకుండా చూడాలన్న తమ లక్ష్యమన దానిని తాము సాధించామని, ఇది గొప్ప విజయమని ఆయన చెప్పారు. ఇతర ప్రతిపక్షాలతో కలిసి సంకీర్ణానికి నాయకత్వం వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
జపాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 30 రోజుల సమయం ఇస్తారు. ఇక్కడ చిన్న పార్టీల కీలకంకానున్నాయి. ఇప్పటికే ఇషిబాతో చేయి కలిపేందుకు డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ది పీపుల్, కన్జర్వేటివ్ జపాన్ ఇన్నోవేషన్ పార్టీ సిద్ధంగా ఉన్నాయి. పాక్షిక పొత్తుకు సిద్ధమని డీపీపీ అధినేత యుచిరో తమాకీ కూడా తెలిపారు.
మరోవైపు ప్రతిపక్షం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 233 సీట్లను ఎవరు సమీకరించగలుగుతారో వేచి చూడాలి.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.