March 12, 2026

శ్రీ సిటీ సెజ్ లో హీరో కంపెనీ కార్మికులకు ఈఎస్ఐ వైద్య శిబిరం

ఈ. ఎస్. ఐ. అందిస్తున్న వైద్యం సేవలను కార్మికులు ఉపయోగించుకోవాలని సూళ్లూరుపేట ఈ. ఎస్. ఐ. వైద్యశాల ఇంచార్జి సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్. జి. పద్మజ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా, శ్రీ సిటీ సెజ్ పరిధిలో శుక్రవారం హీరో కంపెనీలో పనిచేసే కార్మికులు, సిబ్బంది కోసం సూళ్లూరుపేట ఈ. ఎస్. ఐ. డయాగ్నోస్టిక్ సెంటర్ ఇంచార్జి డాక్టర్. జి. పద్మజ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా 300మందికి కార్మికులకు డాక్టర్లు వైద్య సేవలు అందించి బి. పి., షుగర్,ఈ. సి. జి పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో స్పెషలిస్ట్ డాక్టర్లు కె. రామకృష్ణ, జి.ప్రేమ్ చంద్, ఎన్.లీలా కుమారి,జి. ఉమా మహేశ్వర రావు ,ఎస్. కిషోర్, హర్ష వర్ధన్,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
#SriCity #HeroMotors #ESI #MedicalCamp #WorkerHealth #Tirupati #Sullurpeta #HealthAwareness #FreeCheckup

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *