March 11, 2026

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమలలో భక్తుల తాకిడి పెరిగిపోయింది. శనివారం రోజున తిరుమల శ్రీవారిని దర్శించేందుకు ఏకంగా 90,211 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. భక్తిశ్రద్ధతో తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య 43,346. హుండీలో సమర్పించిన కానుకలు రూ. 3.11 కోట్లుగా నమోదయ్యాయి.

సర్వదర్శనం కోసం భక్తులు ఎడతెగని క్యూలైన్లలో నించిపోయారు. ప్రస్తుతం శిలాతోరణం వద్ద బయట క్యూలైన్ కొనసాగుతోంది. సర్వదర్శనం (SSD టోకెన్లు లేకుండా) కోసం సుమారు 24 గంటల సమయం పడుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *