March 27, 2026

తిరుమలలో భక్తుల సందడి… దర్శనానికి 24 గంటలు

తిరుపతి, మే 23 (శుక్రవారం): ఓం నమో వెంకటేశాయ నినాదాలతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మొత్తం 74,374 మంది భక్తులు చేరుకున్నారు.

భక్తి పారవశ్యంలో శేషాచలాన్ని సందర్శించిన వారిలో 37,477 మంది తల నీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీకి భక్తులు మూడుకోట్ల రూపాయల కంటే ఎక్కువగా కానుకలు సమర్పించారు. ఒక్క రోజులో వచ్చిన హుండీ ఆదాయం రూ. 3.02 కోట్లు.

సర్వదర్శనానికి (SSD టోకెన్లు లేకుండా) వచ్చిన భక్తులు సిలాతోరణం వద్ద బయట నిలువలైన క్యూలైన్లలో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *