March 26, 2026

‘దానా’ ముప్పు తప్పినట్లే..!

  • పశ్చిమ బెంగాల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కరిసే అవకాశం
  • ఏపీలొ శ్రీకాకుళంలో ఓ మోస్తరు వర్షాలు 
  • పలు రైళ్లు రద్దు

దానా తుపాను కారణంగా ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వణికిపోయాయి. గురువారం అది తీవ్రంగా మారింది. అర్ధరాత్రి దాటిన తర్వాత లేదా రేపు తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్‌కనిక, ధమ్రా (ఒడిశా)కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది.

ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తుపాను ప్రభావం దాదాపు 36 గంటలు ఉంటుందని అంచనా వేశారు. అయితే ప్రస్తుతం అది వాయువ్య దిశగా గంటకు 13 కి.మీ వేగంతో పారాదీప్ 80 కి.మీ. దూరంలో కదులుతోంది. ఇది పూరీ సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటనున్నది. దీని ప్రభావం పశ్చిమబెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల మీద అధికంగా ఉంటుంది.

ఏపీపై తక్కువగా ఉంటుంది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ప్రభావం చూపుతుంది.  అయితే ఇప్పటికే ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్టణం, కాకినాడ, గంగవరం, విశాఖపట్టణం, కళింగపట్టణం పోర్టుకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సముద్రం అలజడిగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *