-
యేటా రూ.2,684.75 కోట్ల భారం
-
48 గంటల్లోనే లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా రాయితీ సొమ్ము
-
మార్చి 31 , జూలై 31, నవంబరు 30 లోపు- మూడు దఫాల్లో
-
ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెం.1967
-
రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి, అక్టోబరు 25 : రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఈ దీపావళి నుండే మూడు ఉచిత గ్యాస్ సిలిండ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని, సంబందిత మార్గదర్శకాలను, విధి విధానాలను నిర్థేశిస్తూ నేడే ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేస్తున్నట్లు రాష్ట్ర ఆహార & పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
శుక్రవారం రాష్ట్ర సచివాలయం నాల్గోబ్లాక్ ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 31న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు లాంచనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. వెంటనే ప్రతి ఇంటికీ మొదటి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుందన్నారు.
అర్హతలివే
ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే అర్హతలు ఉండాలని అన్నారు. వాటిని ఆయన వివరించారు.
- ఎల్.పి.జి.కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి.
- తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- అర్హతలలో ఆథార్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి.
ప్రపభుత్వంపై రూ. 2684.75 కోట్ల భారం
రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, 1.47 రేషన్ కార్డులు ఉన్నాయని మనోహర్ చెప్పారు. వీరిలో అర్హులైన అందరికీ ఈ పథకం వర్తింప చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం అమలుకై ప్రతి ఏడాది ప్రభుత్వం పై రూ.2,684.75 కోట్ల మేర భారం పడుతుందన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కుంటున్నా సరే, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
బుకింగ్ ఎప్పుడంటే…
ఈ పథకం అమల్లో భాగంగా ఈ నెల 29 నుండి గ్యాస్ బుకింగ్స్ ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. గ్యాస్ బుకింగ్ చేసుకోగానే ఒక ఎస్.ఎం.ఎస్. సంబందిత లబ్దిదారుని ఫోన్ నెంబరుకు వెళుతుందని, గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణా ప్రాంతాల్లో గ్యాస్ సిలిండ్లను డెలివరీ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డి.బి.టి. విధానం ద్వారా లబ్దిదారుల ఖాతాలోని నేరుగా రాయితీ సొమ్ము జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఎప్పుడెప్పుడు ఇస్తారంటే…
ఈ పథకం అమలుకై ఏడాదిని మూడు బ్లాక్ పీడియడ్లుగా పరిగణించడం జరుగుతుందని, మొదటి బ్లాక్ పీడియడ్ ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండో బ్లాక్ పీడియడ్ ను ఆగస్టు 1 నుండి నవంబరు 31 వరకు మరియు మూడో బ్లాక్ పీడియడ్ ను డిశంబరు 1 నుండి మార్చి 31 వరకు పరిగణించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పథకం అమల్లో లబ్దిదారులకు ఏమన్నా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం అందజేసే మూడు ఉచిత సిలిండర్లలో
- మొదటి సిలిండర్ మార్చి 31 లోపు
- రెండోది జూలై 31 లోపు
- మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు
ఈ పథకం అమలుకు సంబందించి ఇప్పటికే మూడు ఆయిల్ కంపెనీలతో మాట్లాడం జరిగిందని, ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వం వద్ద ఉన్న డాటాను బేరీజుకు వేసుకుని రెండింటిని అనుసంధాపరుస్తామన్నారు. ఈ పథకం అమలుకై ఆయిల్ కంపెనీలకు అడ్వాన్పుగా రూ.894.92 కోట్లను ఈ నెల 29 న చెక్కు రూపేణా చెల్లించడం జరుగుతుందన్నారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.