March 24, 2026

దుర్గసముద్రం ఉపసర్పంచ్‌ చిరంజీవికి మాతృవియోగం

– నివాళులు అర్పించిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

తిరుపతి రూరల్‌ మండలం దుర్గసముద్రం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్‌ చిరంజీవికి మాతృ వియోగం కలిగింది. ఆ విషయం తెలుసుకున్న చంద్రగిరి నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మంగళవారం ఆ ఇంటికి వెళ్లి చిరంజీవి తల్లి కస్తూరి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో సర్పంచ్‌ మిట్టపల్లి ప్రసాదరెడ్డి, జ్యోతీశ్వరరెడ్డిలతో పాటు స్థానిక పార్టీ నేతలు వున్నారు.

#MohithReddy #TirupatiRural #Durgasamudram #YSRCP #Condolences #ChandraGiri #LocalNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *