
విజయవాడ, మే 31: ఏపీ మెగా డీఎస్సీ 2025 పరీక్షలు తుది దశకు చేరుకోగా, అభ్యర్థుల కోసం హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ మరింత సులభతరం అయింది. అభ్యర్థులు ఇప్పుడు http://cse.ap.gov.in వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్ ద్వారా కూడా తమ హాల్‌టికెట్లను పొందవచ్చు. 95523 00009 నంబరుకు మెసేజ్ పంపినట్లయితే హాల్ టికెట్ అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు.
డీఎస్సీ నిర్వహణను గమనిస్తూ, విద్యాశాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అభ్యర్థులకు మరింత సౌలభ్యంగా వ్యవస్థను అందిస్తోంది. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే సమగ్ర ఏర్పాట్లు చేపట్టింది. మొత్తం 16,347 టీచర్ పోస్టులు భర్తీకి ఈ మెగా డీఎస్సీ ద్వారా అవకాశం కలుగుతోంది.
లోకేశ్ శుభాకాంక్షలు
ఈ నేపథ్యంలో అభ్యర్థులకు మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ (ప్రస్తుతం ‘ఎక్స్’) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియను వివరించిన ఆయన, డీఎస్సీ నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబద్ధత ఫలితంగా అభ్యర్థులకు ఈ సౌకర్యాలు కల్పించగలిగామని పేర్కొన్నారు.
“ప్రియమైన అభ్యర్థులారా! మీరు ఇప్పుడు http://cse.ap.gov.in లేదా 95523 00009 నెంబర్ ద్వారా WhatsApp సర్వీస్‌లో హాల్ టికెట్లను పొందవచ్చు.
మేము మా వంతు బాధ్యతను నెరవేర్చాం. ఇప్పుడు మీ వంతు వచ్చింది. మీరు పరీక్షల్లో ప్రతిభ కనబరిచి అద్భుత ఫలితాలను సాధించండి” అంటూ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
AP DSC 2025, AP DSC hall ticket, hall ticket WhatsApp download, AP teacher jobs, DSC exam dates, Nara Lokesh wishes, cse.ap.gov.in, WhatsApp hall ticket, AP DSC online services, AP education news