ఆధునిక ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందా? 2030లో ఏం జరుగబోతోంది. జపాన్ బాబా వంగాగా పేరొందిన రియో టాట్సుకి భవిష్యవాణి ఏం చెప్పింది? ప్రపంచం మొత్తాన్ని ఈ వైరస్ చుట్టేస్తుందా? వినాశనం తప్పదా? ఇంతకీ ఆమె ఏం చెప్పారు? ఏం జరుగుతోంది? ప్రస్తుతం ఉన్న కోవిడ్ వైరస్‌కు సంబంధం ఏంటి? భయంకర నిజాలను తెలుసుకుందాం రండీ
2020లో ప్రపంచం కోవిడ్-19తో అతలాకుతలమైంది. ‘వరల్డోమీటర్స్’ లెక్కల ప్రకారం, ఏప్రిల్ 2024 నాటికి కోవిడ్ 7,010,681 మంది ప్రాణాలను బలిగొంది, మొత్తం 704,753,890 కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలు ఎంత భయంకరమైనవో చెప్పకనే చెబుతాయి. అలాంటి మహమ్మారి మళ్లీ ఈ సంవత్సరం ఊహించని విధంగా తిరిగొస్తుండటం ప్రజలను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది.
మే 27 నాటికి భారతదేశంలో కోవిడ్ కేసులు 1000 మార్కును దాటాయి, గత వారం కేవలం 257 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ కేసుల పెరుగుదల మధ్య, జపాన్ మాంగా కళాకారిణి రియో టాట్సుకి ‘కోవిడ్ పునరాగమనం’ గురించిన భవిష్యవాణి ఎవరికీ ఊరటనివ్వడం లేదు. ఆమెను జపాన్ ‘బాబా వంగా’ అని కూడా పిలుస్తారు. ఆమె కోవిడ్-19 గురించి చేసిన భయానక అంచనాలు ఇటీవల వార్తల్లో నిలిచాయి.
టాట్సుకి అంచనాలు: 2030లో మరింత వినాశనం?
టాట్సుకి అంచనాల ప్రకారం, ఈ వైరస్ 2030లో మరింత శక్తివంతంగా తిరిగొస్తుందని తెలుస్తోంది. తెలియని వారికి, టాట్సుకి 1999లో ‘ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్’ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం ఆమెకు రాత్రిపూట వచ్చే పీడకలల ఆధారంగా రాసిన భవిష్యవాణులతో నిండి ఉంది. కోవిడ్ గురించి ఆమె మొదట 2020లో ‘తెలియని వైరస్’ వస్తుందని, ఏప్రిల్‌లో గరిష్ట స్థాయికి చేరి అదృశ్యమవుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత పదేళ్ల తర్వాత వైరస్ మరింత బలపడి, ‘ఎక్కువ వినాశనానికి’ దారితీస్తుందని ఆమె ఊహించారు.
తిరిగి వచ్చే వైరస్ మరింత ప్రాణాంతకం అవుతుందని, ఎక్కువ మరణాలకు కారణమవుతుందని ఆమె అంచనాలు హెచ్చరించాయి. ఆమె అంచనాలలో 2025 గురించి ఏమీ చెప్పనప్పటికీ, ప్రస్తుతం పెరుగుతున్న కేసులు ప్రజలలో భయాందోళన కలిగిస్తున్నాయి. 2019-20 చూసిన వారికి 2030 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా మంది ఆందోళన కలుగుతోంది.
భారతదేశంలో కోవిడ్ కేసులు: తాజా పరిస్థితి
మే 27 నాటికి భారతదేశంలో కోవిడ్ కేసుల విషయానికి వస్తే, కేరళలో అత్యధికంగా 430 కేసులు నమోదయ్యాయి. 209 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది, ఆ తర్వాత ఢిల్లీ (104 కేసులు), గుజరాత్ (83 కేసులు) ఉన్నాయి. TOI నివేదికల ప్రకారం, వైద్యులు ‘కోవిడ్-19 లక్షణాలను’ ‘సాధారణ జలుబు లేదా ఫ్లూ’తో పోలుస్తున్నారు, పరీక్షలు చేయకుండా తేడాను గుర్తించడం కష్టం అని చెబుతున్నారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.