March 27, 2026

‘కొండా’ ఇంకెప్పుడూ ఇలా వ్యాఖ్యానించవద్దు

Konda Surekha
  • తెలంగాణ మంత్రి సురేఖకు కోర్టు మొట్టికాయలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు వేసింది. ఇంకెప్పుడూ కేటీఆర్ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది.

కొండా సురేఖ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యుట్యూబ్ , ఫేస్ బుక్, గూగుల్ ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది.పరువు నష్టం కేసులో ఓ మంత్రికి పై కోర్టు ఇంత సీరియస్ అవటం ఇదే మొదటి సారి కావడం విశేషం.

ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడింది. ఓ బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పేర్కొంది. కేటీఆర్ పై కొండా సురేఖ వ్యాఖ్యలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ గా పరిగణించింది.

భవిష్యత్‌లో ఇంకెప్పుడూ ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్‌పై చేయవద్దని కొండాను సురేఖను ఆదేశించింది. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న ఆ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, వెబ్ సైట్లు, అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్‌లో ఉంచరాదని కోర్టు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *