March 26, 2026

ఫ్లెమింగో ఫెస్టివల్–2026ను వినూత్నంగా నిర్వహించాలి: కలెక్టర్

జనవరి 10, 11 తేదీలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ – 2026 (Flamingo Festival 2026)ను వినూత్నంగా, అందరిని ఆకర్షించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ (District Collector Tirupati) తెలిపారు. ఈ ఫెస్టివల్‌కు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Guest – CM Chandrababu Naidu) ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని పేర్కొన్నారు.

బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఫ్లెమింగో ఫెస్టివల్–2026 నిర్వహణపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు, జూ క్యూరేటర్ సెల్వం, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు (District SP), ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, డీఆర్‌ఓ నరసింహులు, సూళ్లూరుపేట ఆర్‌డీఓ కిరణ్మయి, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డా.రమణ ప్రసాద్, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఏడాది మూడు రోజులపాటు నిర్వహించిన ఈ ఫెస్టివల్‌ను ఈసారి రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు చెప్పారు. పులికాట్–నేలపట్టు, బీవీ పాల్యం, అటకానితిప్ప, ఇరక్కం ఐలాండ్, ఉబ్బలమడుగు, పెరియపాల్యం వంటి ప్రాంతాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధాన వేదిక (Main Venue) ఏర్పాటు చేయనున్నట్లు, వివిధ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఫెస్టివల్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే పెద్ద కార్యక్రమమని, ముఖ్యమంత్రి హాజరు నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం (Tourism Promotion) చేపట్టాలని సూచించారు.

బీవీ పాల్యంలో బోటింగ్ సౌకర్యం కల్పించి, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాలని, పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన రోడ్డు పనులు పూర్తి చేయాలని, అటకానితిప్ప వద్ద వ్యూ పాయింట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పిల్లలు సులభంగా వీక్షించేందుకు ప్రత్యేక స్లాట్లు ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని సూచించారు.

జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ, ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా ప్రతి పర్యాటక కేంద్రంలో సంబంధిత శాఖల నోడల్ అధికారులు ముందుగానే పరిశీలన చేయాలని తెలిపారు. ప్రధాన వేదిక వద్ద క్లౌడ్ మేనేజ్మెంట్ (Crowd Management) పై పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందని, వైద్య సేవలు మరియు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పర్యాటక మరియు సాంస్కృతిక అధికారి ఎం. జనార్ధన్ రెడ్డి, ఏపీటిడీసీ ఈఈ సుబ్రమణ్యం, సంబంధిత జిల్లా అధికారులు, పర్యాటక శాఖ సిబ్బంది, ఈవెంట్ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు.

#FlamingoFestival2026
#TirupatiTourism
#ChandrababuNaidu
#AndhraPradeshTourism
#PulicatLake
#CrowdManagement
#DistrictAdministration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *