జిజిహెచ్‌లో రూ.100 కోట్ల మాతాశిశు విభాగం: నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
గుంటూరు వైద్య రంగంలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. ఉత్తర అమెరికాలో స్థిరపడిన గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల (GMCANA) అపూర్వ సహకారంతో నిర్మించిన అత్యాధునిక మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం (జనవరి 30, 2026) ప్రారంభించనున్నారు.
సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో, 600 పడకల సామర్థ్యంతో ఈ భవనాన్ని నిర్మించారు. 2018లో చంద్రబాబు నాయుడే ఈ భవనానికి శంకుస్థాపన చేయగా, సరిగ్గా 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయనే దీనిని ప్రారంభించడం విశేషం. ఈ భవన నిర్మాణంలో గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు ఐదేళ్ల పాటు కృషి చేసి విరాళాలు సేకరించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ భద్రత మరియు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య పరికరాలను ఇప్పటికే వార్డుల్లో సిద్ధం చేశారు.
#GunturGGH #ChandrababuNaidu #HealthcareAP #GunturMedicalCollege #MCHBlock #PublicHealth #AndhraPradeshNews

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
