May 3, 2026

ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజులు పాటు తిరుపతి, తిరుమల పర్యటన ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులందరూ అప్రమత్తంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారుల ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న మార్గాలలో జరుగుతున్న ఏర్పాట్లు, పారిశుద్ధ్య పనులను శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్చి 20,21 తేదీల్లో ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా తిరుపతి, తిరుమల కు రానున్నారని, ముఖ్యమంత్రి పర్యటన మార్గాల్లో పారిశుధ్థ్యం మెరుగ్గా ఉండేలా చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్లపైన ఎటువంటి గుంతలు లేకుండా చూడాలని, డివైడర్ల మధ్యలో మొక్కలు కత్తిరించాలని, రోడ్డు పక్కన మట్టి, విరిగిన చెట్ల కొమ్మలు లేకుండా శుభ్రం చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలిపిరి, జూ పార్కు రోడ్ల పక్కన ఎటువంటి దుకాణాలు పెట్టకుండా చూడాలని తెలిపారు. అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.మధు, డిసిపీ దేవి కుమారి, ఏసీపీ లు పార్వతి ప్రియ, మూర్తి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.

CMChandraBabu #TirupatiNews #TirumalaVisit #MunicipalAdministration #APPolitics #CleanTirupati #GovernanceUpdates

పారదర్శకంగా ఓటర్ల జాబితా: కమిషనర్ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *