జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విడుదల
అక్రమ మద్యం కేసులో అరెస్టై 226 రోజుల పాటు జైల్లోనే ఉన్న వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత,చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరి జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల అనంతరం పార్టీ నేతలు చెవిరెడ్డికి పూల మాలలు, పుష్పగుచ్చాలు అందించి సాధరంగా ఆహ్వానించారు. మద్యం కేసులో గతేడాది జూన్ 17న చెవిరెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. అక్రమ కేసులు నమోదు చేయడంతో 226 జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ అభియోగాలు
డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అందుకున్నారని.. ఆ సొమ్మును గత అసెంబ్లీ ఎన్నికల టైంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ తన అభియోగాల్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యవహరించారంటూ అభియోగం నమోదు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ-38గా, భాస్కరరెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డిని ఏ-39 నిందితులుగా పేర్కొనడం గమనార్హం.
#ChevireddyBhaskar Reddy #YSRCP #LiquorScam #AndhraPradeshPolitics #HighCourtBail #BreakingNews #TeluguNews

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
