March 27, 2026

భారత సరిహద్దుల్లో సివంగులు !

మహిళా సైనికుల ధైర్యం ప్రశంసనీయం!

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) మహిళా సిబ్బంది అనితరసాధ్యమైన తెగువను చూపారని బిఎస్ఎఫ్ అధికారి చంద్రేష్ సోనా వెల్లడించారు. వారు చూపిన ధైర్యానికి ఆయన హర్షం వ్యక్తం చేశారు. ” BSF బటాలియన్‌లో మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారని, వారు నిబంధనల ప్రకారం తమ హెడ్‌క్వార్టర్స్‌కి వెళ్లాల్సి ఉన్నా, వెళ్ళలేదని దేశరక్షణ కోసం సన్నద్ధంగా ఉంటామని చెప్పారని, తమ సహచరులతో భుజం కలిపి పోరాడతామని స్పష్టం చేశారని ఆయన కొనియాడారు.

“ఒక మహిళా కానిస్టేబుల్ అయితే తన చిన్నారిని కుటుంబానికి అప్పగించి, ఫ్రంట్ లైన్‌లో విధులు నిర్వహించిందని తెలిపారు.

పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇది ఏప్రిల్ 22న ఫహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన చర్య. ఆ దాడిలో 26 మంది నిర్భాగ్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్ర స్థావరాలపై విరుచుకు పడిన విషయం తెలిసిందే.

ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతీయ భూభాగంపై పాకిస్తాన్ తిరుగులేని దాడులకు పాల్పడిందని చంద్రేష్ సోనా వెల్లడించారు. పూంఛ్ సెక్టార్‌ ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలనొన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడ భారీ తుపాకీ దాడులు, షెల్లింగ్ ప్రారంభమయ్యాయి.

పాకిస్తాన్ సైన్యం మరియు రేంజర్ల మద్దతుతో భారతీయ గ్రామాలు, చెక్‌పాయింట్లు, పోస్టులు లక్ష్యంగా మారాయని ఆయన వివరించారు. 10వ తేదీన వారు తమ డ్యూటీ పాయింట్లు, పోస్టులు, గ్రామాలపై 61 మిమీ, 82 మిమీ మోర్టార్లతో భారీ షెల్లింగ్ నిర్వహించారు” అని తెలిపారు.

పాకిస్తాన్ సైన్యంతో పాటు పాక్ రేంజర్లు కూడా ఎదురయ్యారని, మేము వారిపై తీవ్రమైన ప్రతిదాడి జరిపామని వివరించారు. రెండు బలగాలకు భారీ ప్రాణనష్టం కలిగించామని అన్నారు. ఈ సైనిక చర్యలో మహిళా సైనికులు తెగువ చూపారని వెల్లడించారు. కాల్పులు ఆగిన తరువాత కూడా చాలాసేపు పోస్టుల నుంచి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లు పరగులు పెడుతూనే ఉన్నాయని ఆయన చెప్పారు.

మే 8 నుండి 10వ తేదీ మధ్య జమ్మూ ప్రాంతంలో, ముఖ్యంగా పూంఛ్‌లో భారీ షెల్లింగ్, మిసైల్ దాడులు, డ్రోన్ల ద్వారా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 27 మంది మృతి చెందగా, 70 మందికి పైగా గాయపడ్డారు. సహాయశిబిరాలకు లక్షలాది మంది తమ ఇళ్లు విడిచి వెళ్లాల్సి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *