June 1, 2026

కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ షాక్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఉన్నత విద్యాశాఖ కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలతో పాటు సంస్థల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.


ఇకపై కోచింగ్ సెంటర్లు విద్యార్థుల ర్యాంకులను, మార్కులను హోర్డింగ్స్‌పై లేదా వెబ్‌సైట్లలో బహిరంగంగా ప్రదర్శించకూడదు. కేవలం తల్లిదండ్రులకు మాత్రమే వ్యక్తిగతంగా సమాచారం అందించాలి. రోజుకు గరిష్టంగా 5 గంటలు మాత్రమే తరగతులు నిర్వహించాలని, సెలవు దినాల్లో క్లాసులకు స్వస్తి పలకాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

నాయుడుపేటలో CM గర్జన: సంక్షేమం, అభివృద్ధిపై CLARITY! ఈ వార్తను కూడా చదవండి


విద్యార్థి మధ్యలో కోర్సు వదిలేస్తే, మిగిలిన కాలానికి సంబంధించిన ఫీజును 10 రోజుల్లోపు తిరిగి చెల్లించాలి. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను తమ వద్ద ఉంచుకోవడం చట్టవిరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి కోచింగ్ సెంటర్‌లో ‘వెల్నెస్ సెల్’ ఏర్పాటు చేసి, విద్యార్థుల మానసిక స్థితిని పర్యవేక్షించేందుకు కౌన్సెలర్లను నియమించాలి.

జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే పర్యవేక్షక కమిటీలు ఈ నిబంధనల అమలును నిరంతరం తనిఖీ చేస్తాయి. నిబంధనల ఉల్లంఘనకు మొదటిసారి రూ. 50,000, రెండోసారి రూ. 1,00,000 జరిమానా విధిస్తారు. మూడవసారి కూడా తప్పు పునరావృతమైతే సదరు సంస్థ గుర్తింపును శాశ్వతంగా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

#APNews #Education #CoachingCenters #StudentSafety #APGovernment #RankAdsBan #NewGuidelines

నాయుడుపేటలో CM గర్జన: సంక్షేమం, అభివృద్ధిపై CLARITY! ఈ వార్తను కూడా చదవండి

1 thought on “కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ షాక్

  1. ఇది అయ్యే పనేనా? అక్కడ నారాయణ మంత్రి. ఇక్కడ ఈ ప్రకటనలు, పత్రికలన్నీ వీరి అడ్వర్టైజ్మెంట్ పై ఆధారపడి బతుకుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *