March 27, 2026

ఐక్యరాజ్య సమితికి భారత ప్రతినిధిగా రాయలసీమ ప్రాంత మహిళా ఎంపీ

నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు,లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరికి మరో గౌరవ ఆతిథ్య ఆహ్వానం అందింది.79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలు అమెరికా దేశం న్యూయార్క్ నగరంలో నవంబర్ నెలలో 18-22 వరకు జరుగనున్నాయి.

న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రతి దేశానికి చెందిన ప్రతనిధులు పాల్గొంటారు. సమకాలీన సమస్యలు వాటికి పరిష్కారాలు రాజకీయాలు తదితర అంశాలపై ఎక్కడ చర్చ జరుగుతుంది.

మన భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి అవకాశం కల్పించారు. ఐక్యరాజ్య సమితి సమావేశాలకు భారతదేశ ప్రతినిధిగా మాట్లాడేందుకు అవకాశం కల్పించారు.

ఆ మేరకు శబరి న్యూయార్క్ వెళ్ళనున్నారు. తనపై ఎంతో నమ్మకంతో తనను భారత ప్రతినిధిగా ఎంపిక చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. దేశం గర్వించే విధంగా అంతర్జాతీయ వేదికలపై నడుచుకుంటానని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *