March 27, 2026

ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదంటూ వార్తలా?

ప్రజాసేవే మా లక్ష్యమన్న అఖిలప్రియ

ఆళ్లగడ్డ, జూన్ 11: నూతనంగా నిర్మించనున్న సిసిరోడ్డుకు భూమి పూజ చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ రహదారి పనుల ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా పాలన సాగిస్తుండటాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె పేర్కొన్నారు.

నన్ను ఆస్పత్రిలో ఎవ్వరూ చూడలేదంటారా?  
గతంలో తాను ఆసుపత్రి పాలయినప్పుడు నన్నెవరు పరామర్శించలేదని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని అఖిలప్రియ మండిపడ్డారు. “నాకు ఎవరు దూరమయ్యారు? నేను ఏం చేస్తున్నాను? అని అర్థం లేని కథలు రాయడం మానేసి, ప్రజాసేవా కార్యక్రమాలు కవర్ చేయండి,” అని మీడియాకు హితవు పలికారు. స్పృహ తప్పి పడిపోయిన సమయంలో తనను ఎవరు చూశారనే ప్రచారం అవసరమేమిటని ప్రశ్నించారు.

అహోబిలం అభివృద్ధికి కేంద్రం ₹25 కోట్లు మంజూరు
అహోబిలం ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేయడం తమ విజయానికి సంకేతమని తెలిపారు. దేవాలయ పునఃనిర్మాణం, infrastructure development పనులకు ఈ నిధులు ఉపయోగపడతాయని వెల్లడించారు. ఇది తమ ప్రభుత్వ lobyying వల్ల సాధ్యమైందని వివరించారు.

భూమా కుటుంబంలో చర్చకు దారితీసిన పరామర్శ వ్యవహారం
డబ్ల్యూ.గోవిందిన్నెలో జరిగిన మూల పెద్దమ్మ దేవర జాతర లో పాల్గొన్న సమయంలో బీపీ సమస్య వల్ల స్పృహ కోల్పోయిన అఖిలప్రియను ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో భూమా మౌనిక, మంచు మనోజ్ దంపతులు జాతరలో పాల్గొని తిరిగి Hyderabad వెళ్లిపోయారు. కానీ ఆస్పత్రిలో ఉన్న అఖిలప్రియను పరామర్శించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రచారాలపై ఆమె స్వయంగా స్పందిస్తూ, “వ్యక్తిగత వ్యవహారాల కన్నా ప్రజాసేవే ముఖ్యము,” అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *