నేడు విద్యా ప్రతిష్టాన్‌లో అజిత్ పవార్ అంత్యక్రియలు
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన అంత్యక్రియలు (జనవరి 29) ఉదయం 11 గంటలకు విద్య ప్రతిష్టాన్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవార్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అంత్యక్రియలకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. కాగా, అజిత్ పవార్‌కు భార్య సునేత్ర, ఇద్దరు కుమారులు పార్థ్, జే ఉన్నారు. సునేత్ర రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.
#AjitPawar #MaharashtraPolitics #NCP #Baramati #BreakingNews #RestInPeace #TeluguNews #NationalPolitics

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
