March 23, 2026

జననగణనలో పొరపాట్లకు తావివ్వొద్దు: కమిషనర్

TIRUPATI CENSUS

TIRUPATI CENSUS

జననగణనలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా, పటిష్టంగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులు, సిబ్బందికి సూచించారు. జనాభా గణన 2027 పై కచ్చపి ఆడిటోరియంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం కమిషనర్ ఎన్.మౌర్య ప్రారంభించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జనన గణన చేసేందుకు 25 మందిని ఎంపిక చేశామని వారికి మాస్టర్ ట్రైనర్లచే శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మీరందరూ శ్రద్దగా అన్ని విషయాలను నోట్ చేసుకుని మీ కింద వచ్చే వారికి తెలిపి క్షేత్రస్థాయిలో జనన గణన చేయాలని తెలిపారు. 16 సంవత్సరాల తరువాత జరుగుతున్న ఈ జననగణన లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టంగా నిర్వహించి సమగ్రమైన సమాచారాన్ని సేకరించాలని పిలుపునిచ్చారు. రెండు దశల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో అదనపు కమిషనర్ శారదా దేవి, టౌన్ ప్లానింగ్ అధికారి మధుసూదన్, మాస్టర్ ట్రైనర్లు రమాదేవి, సుధారాణి, ఉదయ్, తదితరులు ఉన్నారు.

Tirupati #Census2027 #MunicipalNews #PopulationCensus #TirupatiCorporation #AndhraPradesh #CensusTraining #LocalGovernance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *