March 16, 2026

అమరజీవి త్యాగం తెలుగుజాతికి స్ఫూర్తి

MINISTER DR.DOLA BALA VEERANJANEYA SWAMY

MINISTER DR.DOLA BALA VEERANJANEYA SWAMY

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఘనంగా నివాళులర్పించారు. సోమవారం స్థానిక రైల్వే రోడ్డులోని అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. తెలుగు వారి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన అపర త్యాగశీలి పొట్టి శ్రీరాములు అని, ఆయన ప్రాణత్యాగం వల్లే దేశంలో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభించిందని మంత్రి కొనియాడారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరజీవి త్యాగానికి చిరస్థాయి గుర్తింపునిచ్చిందని మంత్రి పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా, రాజధాని అమరావతిలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. మార్చి 16న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా రాబోయే తరాలకు ఆయన చరిత్ర తెలిసేలా ప్రభుత్వం చొరవ చూపిందని మంత్రి వివరించారు.

కోటంరెడ్డి.. ఫుల్ ‘స్పీడ్’.. హోల్ ‘జోష్’ ఈ వార్తను కూడా చదవండి

స్థానిక గీత మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్‌ ద్వారా అమరావతిలో జరుగుతున్న పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య వాసవి క్లబ్ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి పౌరుడి కనీస బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ లక్ష్మి ప్రసన్నతో పాటు భారీ సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య నాయకులు కొత్తూరి రంగనాయకులు, కోట శ్రీను, ఇమ్మిడిశెట్టి రామారావు, టీడీపీ నేతలు షేక్ సంధాని భాష, మించల బ్రహ్మయ్య, సన్నేబోయిన శ్రీనివాసులు నాయుడు, అలాగే జనసేన మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అమరజీవి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

PottiSriramulu #MinisterDolaBalaVeeranjaneya #APPolitics #Amaravati #TeluguPride #StatueOfSacrifice #TDP #JanaSena #BJP

కోటంరెడ్డి.. ఫుల్ ‘స్పీడ్’.. హోల్ ‘జోష్’ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *