March 15, 2026

టీం ఇండియాలో.. నిప్పూ.. నిప్పే

SANJU SAMSON AND ABHISHEK SHARMA

SANJU SAMSON AND ABHISHEK SHARMA

టీ20 ప్రపంచకప్ 2026 విజయోత్సాహంలో ఉన్న టీమిండియా స్టార్ సంజూ శాంసన్, తన ఓపెనింగ్ పార్ట్నర్ అభిషేక్ శర్మతో ఉన్న అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’లో పాల్గొన్న ఆయన, మైదానంలో తమ జోడీ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో వివరిస్తూనే, వ్యక్తిగతంగా వారి మధ్య ఉన్న సరదా విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా అభిషేక్‌కు ఉన్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను చూసి జట్టులోని ఇతర ఆటగాళ్లు ఎలా ఫీల్ అయ్యేవారో నవ్వుతూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం టీమిండియాలో అభిషేక్ శర్మ క్రేజ్ మామూలుగా లేదని సంజూ శాంసన్ అన్నారు. జట్టు బస్సు ఎక్కడికి వెళ్లినా అభిమానులు కేవలం ‘అభిషేక్.. అభిషేక్..’ అంటూ నినాదాలు చేస్తుంటే తమకు ఆశ్చర్యం వేసేదని తెలిపారు. “అందరూ అతన్నే చూస్తున్నారా? మమ్మల్ని ఎవరూ గమనించడం లేదా?” అని టీమ్‌లోని కుర్రాళ్లమంతా సరదాగా ఒకరి ముఖాలు ఒకరం చూసుకుని అసూయపడేవాళ్లమని సంజూ ఒక రహస్యాన్ని బయటపెట్టారు.

సాధారణంగా సంజూ కూల్‌గా, అభిషేక్ అగ్రెసివ్‌గా ఉంటారని ‘ఐస్ అండ్ ఫైర్’ జోడీ అని పిలుస్తుంటారు. అయితే దీనిని సంజూ సున్నితంగా తిరస్కరించారు. “మేము ఐస్ అండ్ ఫైర్ కాదు, ‘ఫైర్ అండ్ ఫైర్’ (మంటకు మంట). ఒకవేళ అభిషేక్ తగ్గితే నేను బాదుతాను, నేను తగ్గితే అతడు విరుచుకుపడతాడు” అని శాంసన్ వ్యాఖ్యానించారు. ఈ కేరళ-పంజాబీ బంధం మైదానంలో టీమిండియాకు భారీ స్కోర్లను అందిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

క్రీజులో తమ మధ్య ఉండే కమ్యూనికేషన్ చాలా సరళంగా ఉంటుందని సంజూ వివరించారు. బంతి ఎలా వస్తోంది అని అభిషేక్ అడిగితే.. “బానే వస్తోంది, నువ్వు సిక్సర్ కొట్టు” అని తాను చెబుతానని, అంతా చాలా సహజంగా జరిగిపోతుందని అన్నారు. ఒకరి ఆటను ఒకరు ఆస్వాదిస్తూ, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడటమే తమ జోడీ విజయ రహస్యమని సంజూ శాంసన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

SanjuSamson #AbhishekSharma #TeamIndia #T20WorldCup2026 #Champions #CricketLife #FireAndFire #IndianCricket

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *