శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వేదికగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరియు మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు అనంత రాజకీయంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది; కేవలం రెండేళ్ల క్రితం మొదలైన ఈ రాజకీయ వైరం ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి చేరుకోవడమే కాకుండా, ఒకరిపై ఒకరు ఫ్యాక్షన్ సినిమాలను తలపించేలా సవాళ్లు విసురుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ అధినేతలను టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ నారీమణుల సమరం, రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందోనని స్థానిక కేడర్‌లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
“నువ్వో.. నేనో తేల్చుకుందాంరా..”
“ఈ గడ్డ నాది.. ఈ అడ్డా నాది” అన్న చందంగా సాగుతోంది వీరి పోరు. మంత్రి సవిత నిత్యం జగన్ పాలనను విమర్శిస్తూ, రాష్ట్రాన్ని కాపాడేందుకే కూటమి వచ్చిందని చెబుతుంటే.. ఉషశ్రీచరణ్ మాత్రం చంద్రబాబు పాలనను తప్పుబడుతూ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా పెనుకొండ అభివృద్ధిపై జరిగిన చర్చ ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరింది.
“నువ్వు పెనుకొండకు ఏం చేశావో చెప్పాలి” అని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేయగా, సవిత దానికి అదిరిపోయే మాస్ కౌంటర్ ఇచ్చారు. “వందల కోట్ల ప్రాజెక్టులతో పెనుకొండను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం.. అసలు కళ్యాణదుర్గంలో గెలిచి మంత్రిగా ఐదేళ్లు ఏం చేశావో చెప్పే దమ్ముందా?” అని సవాల్ విసిరారు. వలస పక్షుల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ‘రప్పా రప్పా’ అంటూ రెచ్చగొట్టే రాజకీయం ఇక్కడ సాగదని మండిపడ్డారు.
“జగన్ 2.0లో ఫస్ట్ టార్గెట్ నువ్వే!”
మంత్రి సవిత వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ కూడా అదే ఫ్యాక్షన్ స్టైల్లో రియాక్ట్ అయ్యారు. “అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక జగన్ మీద పడి ఏడవడం దేనికి? పెనుకొండకు ఏం చేశావో చెప్పమంటే సంబంధం లేని విషయాలు ఎందుకు?” అని ఫైర్ అయ్యారు.
ఇక్కడితో ఆగకుండా, “గుర్తుపెట్టుకో.. జగన్ 2.0 ప్రభుత్వంలో నా ఫస్ట్ టార్గెట్ నువ్వే” అంటూ పెనుకొండ గడ్డపైనే మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని, వడ్డీతో సహా అన్నీ తిరిగి ఇచ్చేస్తామన్న రేంజ్‌లో ఉషశ్రీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.
ఈ రాజకీయ వ్యవస్థ మారదు….. రాజకీయ మనుషులు మారరు..అర్ధం కాలేదు…. 👍సార్