మేఘాలయలో జరిగిన ‘హనీమూన్ మర్డర్’ (Honeymoon Murder) కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని, అతడి భార్య సోనమ్ (Sonam) తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హత్య (Murder) చేయించింది. సోనమ్ మంగళసూత్రం (Mangalsutra) ఈ కేసులో కీలక ఆధారంగా మారి, దర్యాప్తును (Investigation) కీలక మలుపు తిప్పింది.
మేఘాలయ, జూన్ 12: మేఘాలయ హనీమూన్ మర్డర్ (Honeymoon Murder) కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెళ్లయి రెండు వారాలు గడవకముందే భర్తను భార్య దారుణంగా చంపించింది. ఇండోర్కు చెందిన రాజా రఘువంశీని, అతడి భార్య సోనమ్ (Sonam) పక్కా పథకంలో హతమార్చింది. సోనమ్ ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ఈ కేసులో ప్రధాన సూత్రధారులు. వీరిద్దరు ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నారు.
అయితే, ఈ కేసులో సోనమ్‌ని “మంగళసూత్రం” (Mangalsutra) పట్టించింది. సోనమ్ దంపతులు బస చేసిన హోమ్ స్టే గదిలో మేఘాలయ పోలీసులు సోదా చేస్తున్న సమయంలో నిందితురాలి తాళి దొరికింది. దీంతో పోలీసుల దర్యాప్తు (Investigation) ను మరో కోణంలోకి తీసుకెళ్లింది. హోమ్ స్టే బయటకు వెళ్లిన రోజు, అంటే రాజా రఘువంశీ హత్య (Murder) జరిగిన మే 23న సోనమ్ తన తాళిని, ఉంగరాన్ని గదిలోనే వదిలేసి వెళ్లినట్లు డీఐజీ డీఎన్ఆర్ మారక్ చెప్పారు.
కొత్తగా పెళ్లయిన మహిళ హోమ్ స్టేలో తాళిని, సూట్‌కేస్‌లో ఉంగరాన్ని మరిచి వెళ్లడం ఏంటి? వారికి సందేహాన్ని కలిగించింది. ఒక స్త్రీ తన హనీమూన్ సమయంలో తాళిని ఎలా వదిలేయగలదు..? అని పోలీసులు అనుమానించారు. తాము క్షుణ్ణంగా, అంతే వివరాణాత్మక దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు తమ ప్రమేయాన్ని అంగీకరించారని మేఘాలయ పోలీసులు చెప్పారు. ఏ తాళినైతే రాజా సోనమ్ మెడలో కట్టాడో… అదే తాళి ఆమె చేసిన కుట్రను పట్టించింది.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.