చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజం!
KAKANI GOVARDHAN REDDY
నెల్లూరు: కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు అన్ని విధాలా ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం విమర్శలతో ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. Kakani Govardhan Reddy Criticizes Chandrababu Diversion Politics 2026 నిరసనలో భాగంగా ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలోని వీరంపల్లి, మనుబోలు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఏపీలో విద్యుత్ కోతలు ఉండటానికి వీల్లేదు – మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ వార్తను కూడా చదవండి
రైతుల ఆందోళన – ప్రభుత్వ నిర్లక్ష్యం: పర్యటనలో భాగంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంపై రైతులు కాకాణి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వంలో తాము నిర్మించిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, వాటర్ ట్యాంకులకు నేడు కూటమి ప్రభుత్వం రంగులు వేసి ప్రారంభించుకుంటోందని ఆయన ఎద్దేవా చేశారు. జగనన్న హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి గూడు కల్పిస్తే, నేడు చంద్రబాబు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. రైతుల భూములను పోలీసుల సాయంతో ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు కాకాణికి లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు.
రాష్ట్రంలో ఇంధన కొరత – అమరావతి దోపిడీ: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమని కాకాణి దుయ్యబట్టారు. అమరావతి పేరిట దోపిడీ కొనసాగిస్తూ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా, ఇంధన ధరల విషయంలో చంద్రబాబు వైఖరిని కేంద్రం తప్పుబట్టడం ఆయనకు జరిగిన అవమానమని అన్నారు. ఏ రోజు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, పోలీసుల పెత్తనాన్ని సాగనివ్వబోమని ఆయన హెచ్చరించారు.
News Article (English)
Nellore: Former Minister and YSRCP Nellore District President Dr. Kakani Govardhan Reddy has hit out at the coalition government, accusing Chief Minister Chandrababu Naidu of resorting to “diversion politics” to cover up his failures. As part of the Kakani Govardhan Reddy Criticizes Chandrababu Diversion Politics 2026 campaign, he visited Veerapalli and Manubolu villages in the Sarvepalli constituency, where he interacted with farmers and local residents regarding their grievances.
Farmer Distress and Development Neglect: During his visit, farmers expressed grave concern over the skyrocketing prices of fertilizers, making agriculture unsustainable. Kakani reminded the public of the infrastructure development under Jagan’s regime, including cement roads, drains, and drinking water facilities. He alleged that the current government is merely repainting the water tanks built during the YSRCP tenure and claiming credit. He also criticized the TDP for neglecting the poor’s housing needs and accused local leaders of using police force to grab farmers’ lands.
Fuel Crisis and Policy Failures: Kakani raised the issue of the unprecedented petrol and diesel shortage in Andhra Pradesh, calling it a direct result of Naidu’s mismanagement. He stated that while the CM is busy with the “Amravati loot,” the common man is struggling for basic fuel. He further added that it is a matter of shame that the Central Government had to rectify the fuel issues despite TDP being an NDA ally. Kakani concluded by asserting that the people are ready to bring Jagan Mohan Reddy back to power and that the YSRCP will continue to fight against the high-handedness of the current administration.
#KakaniGovardhan ReddyCriticizes Chandrababu Diversion Politics2026 #Nellore News #YSRCP #APPolitics #ChandrababuNaidu #FarmerDistress #APFuelCrisis #JaganMohan Reddy #Sarvepalli #TeluguNews
ఏపీలో విద్యుత్ కోతలు ఉండటానికి వీల్లేదు – మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ వార్తను కూడా చదవండి

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
