పశ్చిమగోదావరి వైసీపీలో ముదిరిన ముఠా రాజకీయం: గెస్ట్ అప్పియరెన్స్లకే పరిమితమైన నేతలు!
EX CM YS JAGAN
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని రిజర్వుడు నియోజకవర్గాల్లో YSRCP West Godavari నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చింతలపూడి, గోపాలపురం, మరియు కొవ్వూరు నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్జ్ లు కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో క్యాడర్ తీవ్ర అసహనానికి లోనవుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటూ, కేవలం గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు కోల్పోవడమే కాకుండా, ద్వితీయ శ్రేణి నేతలు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు.
చింతలపూడి ఇంచార్జ్ కంభం విజయరాజు నియోజకవర్గానికి దూరంగా ఏలూరులో నివసిస్తుండగా, కార్యకర్తలు ఏదైనా సమస్య వస్తే ఏలూరు వరకు వెళ్లాల్సి వస్తోంది. కార్యకర్తలపై కేసులు నమోదైనా లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనా అండగా నిలవాల్సిన నాయకుడు అందుబాటులో లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకున్నా పరిస్థితిలో మార్పు రాలేదని స్థానిక నేతలు వాపోతున్నారు.
దూరం పాటిస్తున్న మాజీ మంత్రులు గోపాలపురం నియోజకవర్గం పరిస్థితి మరీ ఇబ్బందకరంగా ఉందని YSRCP West Godavari శ్రేణులు అంటున్నాయి. మాజీ మంత్రి తానేటి వనిత ఇక్కడి ఇంచార్జ్ గా ఉన్నప్పటికీ, ఆమె తాడేపల్లిగూడెంలో నివాసం ఉంటున్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గమంతా తిరిగిన ఆమె, ఇప్పుడు మాత్రం కార్యకర్తలకు కనీసం దర్శనం ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో గోపాలపురంలో ఇప్పటికే చాలా మంది నేతలు కూటమి పార్టీలలో చేరిపోగా, మిగిలిన వారు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
అదేవిధంగా కొవ్వూరు ఇంచార్జ్ తలారి వెంకట్రావు కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ఆయన నివాసం గోపాలపురంలో ఉండటంతో, కొవ్వూరు కార్యకర్తలు ఆయనను కలవడానికి కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇప్పటికే తాడేపల్లిగూడెం ఇంచార్జ్ మార్పుపై చర్చ జరుగుతున్న తరుణంలో, ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా స్థానికంగా ఉండే నేతలకే బాధ్యతలు అప్పగించాలని క్యాడర్ కోరుతోంది. లేనిపక్షంలో ఈ నియోజకవర్గాల్లో పార్టీ మరింత చెల్లాచెదురు అయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
English Version
The political situation for YSRCP West Godavari in the reserved constituencies of the combined district is reportedly in a state of disarray. In the Chintalapudi, Gopalapuram, and Kovvuru segments, the party cadre is fuming over the absence of their respective constituency in-charges. It is alleged that leaders who acted as pillars of support during the victory are now nowhere to be seen after the electoral defeat, leaving the grassroots workers to handle issues on their own.
In Chintalapudi, in-charge Kambham Vijayaraju resides in Eluru, making only occasional “guest appearances” in the constituency. Workers facing legal issues or local problems are forced to travel to Eluru to meet him. Despite repeated appeals to the party high command, no corrective measures have been taken, leading to significant frustration within the ranks.
Distance Maintained by Former Ministers Former Minister Taneti Vanitha, the in-charge for the Gopalapuram constituency, is reportedly staying in Tadepalligudem, creating a gap between her and the local cadre. Although she was very active during the election campaign, her current unavailability has led many second-tier leaders to join the ruling alliance parties. Similarly, Kovvuru in-charge Talari Venkatrao resides in the Gopalapuram constituency, making it difficult for Kovvuru workers to reach him for support.
The YSRCP West Godavari leadership’s decision to swap these leaders during the last election—sending Venkatrao to Kovvuru and Vanitha to Gopalapuram—has backfired as both lost and subsequently distanced themselves from their workers. Amid rumors of a change in the Tadepalligudem in-charge, there is an increasing demand from the cadre to appoint local leaders who are physically present in the constituencies. Failing to address this leadership vacuum could lead to further erosion of the party’s base in these crucial reserved seats.
#YSRCPWestGodavari #AndhraPolitics #TanetiVanitha #Chintalapudi #Gopalapuram #Kovvuru #YSJagan #PoliticalCrisis #APNews #YSRCPCadre

