May 1, 2026

జనసేన నంబర్2కు ప్రోటోకాల్ ప్రాధాన్యతేది?

MLC Naga Babu Protocol Issues

ఎచ్చెర్లలో నాగబాబు పర్యటనపై ప్రత్యేక కథనం

MLC Naga Babu Protocol Issues : జనసేన పార్టీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడిగా నంబర్ 2 స్థానంలో ఉన్న ఎమ్మెల్సీ నాగబాబుకు సొంత కూటమి ప్రభుత్వంలోనే ప్రోటోకాల్ ఇబ్బందులు ఎదురవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్న నాగబాబు, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో అక్కడ వరుస పర్యటనలు చేస్తున్న ఆయనకు అధికార యంత్రాంగం నుండి సరైన గౌరవం, ప్రోటోకాల్ లభించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా అరసవల్లి రథసప్తమి వేడుకలు మరియు సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాల వంటి అధికారిక కార్యక్రమాలకు కనీసం ఆహ్వానం కూడా పంపకపోవడంపై నాగబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉండి కూడా జిల్లా యంత్రాంగం తనను విస్మరించడం వెనుక మిత్రపక్షాల్లోని కొందరు కీలక నేతల ఒత్తడి ఉందన్న అనుమానాలను జనసేన శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆయన నేరుగా శాసన మండలి కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో, సెక్రటరీ జనరల్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read this article : శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మహానాడు: ప్రధాని మోడీ పర్యటనే కారణమా?

ఎచ్చెర్ల పాలిటిక్స్‌లో హీట్: నాగబాబు ప్లాన్ ఏంటి?

ఎచ్చెర్ల నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉండటంతో నాగబాబు ఇక్కడి నుండి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో ఉన్నారు. అయితే, ఈ నియోజకవర్గంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావుకు బలమైన పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఆయనను చీపురుపల్లికి పంపినప్పటికీ, 2029లో తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు కోసం ఈ సీటును కళా ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రస్తుత విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా వచ్చే ఎన్నికల్లో ఎచ్చెర్ల నుండే బరిలోకి దిగాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఇంతమంది పోటీదారులు ఉన్న ఎచ్చెర్ల సీటులో పట్టు సాధించేందుకు నాగబాబు వారంలో మూడు నాలుగు రోజులు ఇక్కడే మకాం వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను నాగబాబుకు అప్పగించారని, అందుకే ఆయన ఇక్కడ యాక్టివ్ అవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఇకపై నాగబాబు పర్యటనల్లో ప్రోటోకాల్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


English Version

Janasena’s key leader and MLC Naga Babu is reportedly facing protocol issues in the Etcherla constituency of Srikakulam district. Despite being the sibling of party chief Pawan Kalyan and holding a high-ranking position, Naga Babu is experiencing a lack of support from official machinery during his visits. The Janasena cadre is fuming over the fact that Naga Babu was not invited to official programs, such as the Arasavalli Ratha Saptami and Surya Narayana Swamy Kalyanotsavam festivals.

Naga Babu has formally lodged a complaint with the Legislative Council office regarding these protocol violations. Following this, the Secretary General wrote a letter to the District Collector, and the state government subsequently issued orders to ensure that protocol is strictly followed during the MLC’s visits. There are allegations within the Janasena party that the administrative neglect is a result of pressure from key leaders within the alliance parties who are wary of Naga Babu’s presence in Etcherla.

Competition for Etcherla: The Political Equation

Naga Babu’s focus on Etcherla is attributed to the significant Kapu community vote bank in the region. However, this move has stirred local politics, as TDP veteran Kala Venkata Rao is eyeing this seat for his son, Ram Mallik Naidu, in 2029. Additionally, Vizianagaram MP Kalisetti Appalanadu, who hails from this constituency, is also rumored to be planning a contest from here in the next elections.

Undeterred by these challenges, Naga Babu plans to spend more time in Etcherla—roughly three to four days a week—to build a strong ground-level presence. As Janasena aims to strengthen its hold in North Andhra, Naga Babu’s increased activity in Etcherla is seen as a strategic move approved by Pawan Kalyan. The ongoing protocol issues highlight the friction between the alliance partners at the local level despite their cooperation at the state level.


#NagaBabu #Janasena #Etcherla #ProtocolIssue #SrikakulamPolitics #AndhraPradesh #TDPJanasenaAlliance #MLCNagaBabu #APPolitics #NorthAndhra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *