బీజేపీలో చేరుతున్నారా? మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి క్లారిటీ!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుండగా, దీనిపై ప్రీతి రెడ్డి స్పష్టత ఇచ్చారు.
హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో ఆమె భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఆమె తన పర్యటనపై స్పందిస్తూ, ఇది రాజకీయ ఉద్దేశ్యంతో కూడినది కాదని పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి ప్రీతి రెడ్డి?
తాను కేవలం ఏఐ (AI) యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందించేందుకే బీజేపీ కార్యాలయానికి వచ్చానని ఆమె తెలిపారు. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని స్పష్టం చేశారు. ఎంపీ టికెట్ కోసం తాను రాలేదని, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని ఆమె వెల్లడించారు.
భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అంశంపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మామ మల్లారెడ్డి రాజకీయాల్లో ఉన్నారని, ఆయన తమలో ఎవరినైనా పోటీ చేయమంటే సిద్ధమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చునని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Will Preethi Reddy Join BJP?
Former Minister and BRS MLA Ch. Mallareddy’s daughter-in-law, Preethi Reddy, met BJP state leaders at the party office, sparking intense discussions in Telangana politics. As rumors about her joining the party grew, she provided clarification on the meeting.
Her meeting with General Secretary Chandrashekhar Tiwari at the BJP office in Hyderabad triggered intense speculation in political circles. However, she responded to her visit, stating that it was not politically motivated.
Preethi Reddy’s Comments
She clarified that she visited the BJP office solely to extend an invitation for the AI University inauguration. She stated that there was no political significance to this meeting. She also noted that she did not come seeking an MP ticket and that there is still plenty of time for elections.
Regarding entering politics in the future, she made key comments. She mentioned that her father-in-law, Mallareddy, is in politics, and if he asks any of them to contest, she is ready. Her remark that “anything can happen in the future” has sparked significant interest.
#PreethiReddy #BJP #Mallareddy #TelanganaPolitics #BRS #HyderabadNews #Telangana #PoliticalUpdate #ElectionNews #LatestNews

