కార్యకర్తకు ఎమ్మెల్యే Gudem Mahipal Reddy రూ. లక్ష ఆర్థిక సాయం
తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఎమ్మెల్యే Gudem Mahipal Reddy అండగా నిలుస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం డివిజన్ ఎస్ఎన్ కాలనీకి చెందిన యూసుబ్ అనే కార్యకర్త గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుధవారం ఉదయం యూసుబ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. యూసుబ్ దశాబ్దాలుగా ఎమ్మెల్యే జిఎంఆర్ వెంటే ఉంటూ నికార్సైన అనుచరుడిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం తన సొంత నిధులతో రూ. 1 లక్ష ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే Gudem Mahipal Reddy అందజేశారు. నిపుణులైన వైద్యులతో మాట్లాడి యూసుబ్‌కు మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమమే తన మొదటి ప్రాధాన్యతని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ముప్పై ఐదేళ్ల అనుబంధం గత 35 ఏళ్లుగా తన కష్టసుఖాల్లో, గెలుపోటముల్లో తోడుగా ఉన్న ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యుడిలా భావిస్తానని ఎమ్మెల్యే Gudem Mahipal Reddy తెలిపారు. కార్యకర్త కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం తన బాధ్యతని, యూసుబ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నాయకుడి హోదాలో కాకుండా ఒక అన్నలా వచ్చి తనను పరామర్శించడంపై యూసుబ్ భావోద్వేగానికి గురయ్యారు.
నమ్ముకున్న నాయకుడు తన కష్ట కాలంలో ఇంటికి వచ్చి ఆర్థిక సాయం అందించడం పట్ల యూసుబ్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
English Version
Patancheru MLA Gudem Mahipal Reddy has once again shown his commitment to his supporters. He visited a dedicated party worker named Yusuf, a resident of SN Colony in Ramachandrapuram Division, who has been battling cancer recently. Yusuf has been a loyal follower of MLA GMR for decades. Upon learning about his illness, the MLA visited Yusuf’s residence on Wednesday morning to enquire about his health and boosted his morale.
MLA Gudem Mahipal Reddy provided immediate financial assistance of ₹1 lakh from his personal funds for Yusuf’s medical treatment. He assured the family that he would consult with expert doctors to ensure the best possible healthcare for Yusuf. The MLA emphasized that standing by party workers during their difficult times is his top priority.
A 35-Year Bond MLA Gudem Mahipal Reddy remarked that he considers every worker who has stood by him through wins and losses over the last 35 years as a member of his own family. He stated that it is his responsibility to support them in their time of need. Yusuf expressed his gratitude, stating that he felt immensely supported by the leader’s personal visit.
Yusuf’s family members thanked the MLA for his timely financial help and emotional support. Local public representatives and key party leaders were present during the visit.
#GudemMahipal Reddy #MLA #Patancheru #FinancialAid #TelanganaNews #HealthSupport #GMR #Ramachandrapuram #CancerAwareness #SocialService #Politics

