అందరికీ నచ్చే ‘Bad Boy Karthik Movie’: ఏప్రిల్ 17న గ్రాండ్ రిలీజ్!
BAD BOY KARTHIK
యువ హీరో నాగ శౌర్య, దర్శకుడు రామ్ దేశినా (రమేష్) కాంబోలో రూపొందిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా Bad Boy Karthik Movie. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ తమ సినిమా అనుభవాలను పంచుకుంది.
మాధవ్ ‘Maremma Movie’ నుండి బావ బావ సాంగ్ విడుదల: విలేజ్ యాక్షన్ డ్రామా ఈ వార్తను కూడా చదవండి
హీరో నాగ శౌర్య మాట్లాడుతూ.. డీఓపీ రసూల్ తనను ఈ సినిమాలో చాలా విభిన్నంగా, స్టైలిష్‌గా చూపించారని కొనియాడారు. హీరోయిన్ విధికి ఇది టాలీవుడ్‌లో మంచి లాంచ్ అవుతుందని, సాయికుమార్, సముద్రఖని, వెన్నెల కిషోర్ వంటి భారీ తారాగణం ఉండటం సినిమాకు పెద్ద బలం అని తెలిపారు. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీనియర్ నటి శ్రీదేవి విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, నిర్మాత శ్రీనివాస్ ఎన్నో కష్టాలను అధిగమించి ఈ చిత్రాన్ని పూర్తి చేశారని ప్రశంసించారు.
అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
నిర్మాత శ్రీనివాస్ చింతలపూడి మాట్లాడుతూ.. తమ బ్యానర్‌లో వస్తున్న ఈ మొదటి సినిమా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తెలిపారు. నాగ శౌర్యని మునుపెన్నడూ చూడని డిఫరెంట్ స్టైల్‌లో ప్రేక్షకులు చూస్తారని, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా నిలుస్తాయని చెప్పారు. అలాగే జూన్‌లో తమ తదుపరి సినిమాను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. డీఓపీ రసూల్ మాట్లాడుతూ.. సినిమా మేకింగ్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, అవుట్‌పుట్ మాత్రం చాలా సర్ప్రైజింగ్‌గా వచ్చిందని, థియేటర్‌లో ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
News Article (English)
Young hero Naga Shaurya’s upcoming intense action drama Bad Boy Karthik Movie is all set to hit the big screens on April 17th. Directed by Ram Desina (Ramesh) and produced by Srinivas Rao Chintalapudi under the Sri Vaishnavi Films banner, the film’s team recently held a grand pre-release event to share insights about their journey.
Naga Shaurya praised the visuals captured by DOP Rasool, stating that he looks his stylish best in this film. He welcomed the lead actress Vidhi to the Telugu industry and expressed his gratitude to the ensemble cast, including Sai Kumar, Samuthirakani, and Vennela Kishore. “I believe this film will resonate with everyone,” Shaurya remarked. Supporting actress Sridevi Vijaykumar shared her excitement, noting that the producer’s dedication despite several challenges has ensured a high-quality cinematic experience.
A Commercial Entertainer with High Octane Action
Producer Srinivas Chintalapudi described Bad Boy Karthik Movie as an out-and-out commercial entertainer. He promised that the audience would witness a completely different side of Naga Shaurya, particularly in the action-packed sequences. He also hinted at a new project starting in June. DOP Rasool added that despite a tough production journey, the final output is fantastic and full of surprises that will thrill the audience. With strong visuals and an engaging narrative, the movie is expected to make a mark at the box office this weekend.
#BadBoyKarthikMovie #NagaShaurya #SrideviVijaykumar #TeluguCinema #NewMovieRelease #ActionDrama #VennelaKishore #RasoolEllore #TollywoodNews #BadBoyKarthik
మాధవ్ ‘Maremma Movie’ నుండి బావ బావ సాంగ్ విడుదల: విలేజ్ యాక్షన్ డ్రామా ఈ వార్తను కూడా చదవండి

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
