వైభవ్ ఊచకోత: ఆర్సీబీపై రాయల్స్ విక్టరీ
VAIBHAV SURYA VANSHI
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ అజేయ ప్రస్థానం కొనసాగుతోంది. శుక్రవారం గువహటి వేదికగా జరిగిన పోరులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌కు తోడు ధ్రువ్ జురెల్ అజేయ పోరాటం తోడవ్వడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, సీజన్లో వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీకి ఈ సీజన్లో ఇదే తొలి ఓటమి.
ముకుల్ చౌదరి: కొత్త సిక్సర్ల కింగ్ ఈ వార్తను కూడా చదవండి
సూర్యవంశీ విశ్వరూపం.. జురెల్ ధనాధన్
లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌కు వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసిన సూర్యవంశీ (78), ఆర్సీబీ బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. అతనికి ధ్రువ్ జురెల్ (81 నాటౌట్) అద్భుత సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు కేవలం 37 బంతుల్లోనే 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. చివర్లో రవీంద్ర జడేజా (24 నాటౌట్)తో కలిసి జురెల్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.
రాణించిన పాటిదార్, వెంకటేశ్ అయ్యర్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ రజత్ పాటిదార్ (63), విరాట్ కోహ్లీ (32) ఆదుకున్నారు. అయితే మధ్యలో వరుస వికెట్లు పడటంతో ఒక దశలో 125 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (29 నాటౌట్), రొమారియో షెఫర్డ్ (22) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
రాయల్స్ బౌలర్ల ధాటి
రాజస్తాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్, జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ శర్మ తలో రెండు వికెట్లు తీసి ఆర్సీబీని కట్టడి చేశారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో బిష్ణోయ్ పొదుపుగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే చివరి ఓవర్లలో ఆర్సీబీ బ్యాటర్లు ధాటిగా ఆడటంతో భారీ స్కోరు నమోదైంది. ఛేదనలో మెరుపులు మెరిపించిన వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
#IPL2026 #RajasthanRoyals #RCB #VaibhavSuryavanshi #DhruvJurel #CricketNews #HallaBol #RoyalChallenge #IPLHighlights
ముకుల్ చౌదరి: కొత్త సిక్సర్ల కింగ్ ఈ వార్తను కూడా చదవండి

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
