కూటమి ధీమా.. ఆంతర్యం ఇదేనా?
AP NDA KUTAMI
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ, రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది. రాబోయే 30 ఏళ్ల పాటు ఏపీలో కూటమి ప్రభుత్వమే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్న ధీమా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వస్తుందని, అది తమకు కలిసి వస్తుందని ఆశలు పెట్టుకున్న వైసీపీకి కూటమి నేతలు గట్టి సవాల్ విసురుతున్నారు.
30 ఏళ్ల స్థిరమైన నాయకత్వమే లక్ష్యం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలబడాలంటే కనీసం మూడు దశాబ్దాల పాటు స్థిరమైన పాలన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి ఏపీని గట్టెక్కించడమే కాకుండా, అన్స్టాపబుల్ డెవలప్మెంట్ దిశగా పరుగులు పెట్టించేందుకు మాస్టర్ స్కెచ్ సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
CTR POLITICS: 14 కాస్తా.. 19 లేక 20? ఈ వార్తను కూడా చదవండి
ప్రజా వ్యతిరేకతకు తావులేకుండా అడుగులు
సాధారణంగా అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా కొంత వ్యతిరేకత సహజం. కానీ, చంద్రబాబు ఈ విషయంలో చాలా ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు నుంచి సంక్షేమ పథకాల అమలు వరకు ప్రతీ అంశాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ‘పబ్లిక్ పల్స్’ తెలుసుకుంటూ, ప్రజల్లో అసంతృప్తి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ వ్యూహాత్మక అడుగులే ఆయన ధీమాకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
హామీల అమలు.. క్షేత్రస్థాయి భరోసా
ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర కీలక పథకాలను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి గ్రౌండ్ చేస్తోంది. ఇప్పటికే ప్రధాన పథకాలు అమలులోకి రాగా, మిగిలిన హామీలను కూడా ఎన్నికల నాటికి పూర్తి చేయాలన్నది బాబు సంకల్పం. ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్తుండటం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోందని, అందుకే వచ్చే ఎన్నికల్లోనూ విజయం తమదేనని కూటమి నేతలు ధైర్యంగా చెప్తున్నారు.
వైసీపీకి అందని అవకాశం
ప్రభుత్వ వ్యతిరేకతే తమను గట్టెక్కిస్తుందని భావిస్తున్న వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వబోమని పవన్ కళ్యాణ్ ఇదివరకే హెచ్చరించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాటలో “వైసీపీ మళ్ళీ రాదు గాక రాదు” అని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఇంత ఔట్రైట్గా ఛాలెంజ్ చేయడం వెనుక బలమైన క్షేత్రస్థాయి నివేదికలు ఉన్నట్లు తెలుస్తోంది.
#APPolitics #ChandrababuNaidu #PawanKalyan #AlliancePower #TDP #JanaSena #AndhraPradesh #Development #PoliticalNewsTelugu
CTR POLITICS: 14 కాస్తా.. 19 లేక 20? ఈ వార్తను కూడా చదవండి

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.