April 6, 2026

ఇరాన్‌కు భారీ షాక్.. ఇంటెలిజెన్స్ చీఫ్ హతం!

IRAN INTELLIGENCE CHIEF

IRAN INTELLIGENCE CHIEF

పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) గూఢచార విభాగం అధిపతి మేజర్ జనరల్ మజీద్ ఖాదెమి మరణించారు. సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్ సమీపంలోని నివాస ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన వైమానిక దాడుల్లో ఆయన హతమైనట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. ఈ పరిణామంతో ఇరాన్ రక్షణ మరియు నిఘా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది.

మజీద్ ఖాదెమి గత ఐదు దశాబ్దాలుగా ఇరాన్ నిఘా మరియు భద్రతా విభాగంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఇరాన్ విప్లవానికి, వ్యవస్థకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని ఐఆర్‌జీసీ కొనియాడింది. ముఖ్యంగా విదేశీ శత్రువుల వ్యూహాలను చిత్తు చేయడంలో ఆయన దిట్టగా పేరుగాంచారు. ఖాదెమి మరణం ఇరాన్ గూఢచార రంగానికి తీరని లోటుగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

US Airman Rescued : పైలట్‌ను సురక్షితంగా కాపాడిన యూఎస్ బలగాలు! ఈ వార్తను కూడా చదవండి

సోమవారం తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఖాదెమితో పాటు మొత్తం 25 మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఇరాన్ రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసే లక్ష్యంతోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడులకు ప్రతికారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మరియు దాని పొరుగు దేశాలపై క్షిపణులతో దాడులు చేస్తోంది.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పుడు నేరుగా కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే స్థాయికి చేరింది. ఆదివారం హైఫా నగరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఇద్దరు మరణించగా, దానికి ప్రతికారంగానే అమెరికా-ఇజ్రాయెల్ ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది.

#Iran #Israel #USMilitary #MajidKhademi #IRGC #TehranStrikes #MiddleEastCrisis #BreakingNews

US Airman Rescued : పైలట్‌ను సురక్షితంగా కాపాడిన యూఎస్ బలగాలు! ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *