
- నలుగురు మృతి
మరలి ముప్పు ముంచుకొస్తోందా? గతంలోనే చెరిపివేశామనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ దేశాన్ని తన భయపెట్టే నీడలోకి తీసుకువెళ్తోంది. తాజా గణాంకాలు చూస్తే అప్రమత్తత అవసరమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
3,000 కేసులు దాటేశాయ్ – మరణాలు నాలుగు
దేశంలో ప్రస్తుతం క్రియాశీల కరోనా కేసులు 3,000 మార్కును అధిగమించాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, ఇప్పటివరకు దేశంలో నలుగురు మృతిచెందారు. ఈ మరణాలు ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ఈ పెరుగుదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మరింత పెరిగింది.
కేరళలో అత్యధిక కేసులు
కరోనా వైరస్ కేసుల్లో కేరళ మరోసారి ముందు వరుసలో నిలిచింది. అక్కడ మొత్తం 1,336 క్రియాశీల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 467 కేసులు, ఢిల్లీలో 375 కొత్త కేసులు గుర్తయ్యాయి. గుజరాత్‌లో ప్రస్తుతం 265 క్రియాశీల కేసులున్నాయి.