March 25, 2026

తిరుమలకుపోటెత్తిన భక్తులకు : దర్శనానికి 20గంటలు

ఓం నమో వేంకటేశాయ |

తిరుపతి,జూన్ 1 : తిరుమలలో శనివారం రోజున భక్తులు భారీగా దర్శనార్థం చేరుకున్నారు. టిటిడి అధికారుల ప్రకారం ఆ రోజు మొత్తం 95,080 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం పొందారు.

ఆ రోజున తల నీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 39,668గా నమోదైంది. భక్తులు హుండీలో రూ.3.47 కోట్లు కానుకలుగా సమర్పించారు.

భారీ భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వదర్శనం (SSD టోకెన్లులేని) భక్తులకు సిలాతోరణం వద్ద వెలుపల క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందుబాటులో ఉన్న కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండి, భక్తులు లైన్‌లో నిలిచి ఉన్న పరిస్థితి నెలకొంది. సర్వదర్శనానికి అంచనా ప్రకారం సుమారు 20 గంటలు పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *