తిరుపతి పోలీసులు చేసిన పనికి వావ్ అనాల్సిందే..
జాతీయ స్థాయి పోలీస్ హాకీ పోటీల్లో తిరుపతి జిల్లా పోలీస్ సిబ్బంది ప్రతిభ కనబరిచి జిల్లా పేరు ప్రతిష్టలు పెంచారు. గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ సిటీలో నిర్వహించిన 74వ ఆల్ ఇండియా పోలీస్ హాకీ ఛాంపియన్‌షిప్ 2025–26 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి సత్తా చాటారు.
ఈ పోటీల్లో ప్రతిభ చూపిన తిరుపతి జిల్లా పోలీస్ సిబ్బంది టీఎస్ అమృత్ కుమార్ (పిసి–873), ఈస్ట్ పోలీస్ స్టేషన్, ఎం. వరముని (పిసి–1037), బీఎన్ కండ్రిగ పోలీస్ స్టేషన్ వారిని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, జిల్లా పోలీస్ శాఖకు గౌరవం తీసుకువచ్చినందుకు ఇరువురిని ప్రశంసించారు. పోలీస్ శాఖలో క్రీడలకు ప్రోత్సాహం ఎంతో అవసరమని పేర్కొంటూ, వారి ప్రతిభకు గుర్తింపుగా రివార్డు ప్రకటించారు. ఈ విజయం ఇతర సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.