April 6, 2026

Vizag Pedagadili Murder : క్రికెట్ బెట్టింగ్ గొడవలో యువకుడి దారుణ హత్య!

Cricket killed in Vizag

Vizag Pedagadili Murder : క్రికెట్ బెట్టింగ్ గొడవలో యువకుడి దారుణ హత్య!విశాఖపట్నం నగరం పెదగదిలిలో ఆదివారం సాయంత్రం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా సాగాల్సిన ఆట కాస్తా ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. క్రికెట్ ఆడుతున్న సమయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఒక యువకుడిని బలితీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అజిత్ (23), కిషోర్ (26) అనే ఇద్దరు యువకులు స్థానిక మైదానంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడారు. ఆట ముగిసిన అనంతరం ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. పాత కక్షలు ఉన్నాయా లేక ఆటలో జరిగిన గొడవే కారణమా అన్నది తెలియాల్సి ఉంది. పెదగదిలి జంక్షన్ వద్ద కిషోర్ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయి, తన వద్ద ఉన్న కత్తితో అజిత్‌పై దాడి చేశాడు.

Read this article also : Kukatpally Gangrape : ప్రేమ పేరుతో పెళ్లి.. మొదటి రాత్రే గ్యాంగ్ రేప్!

కిషోర్ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో అజిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జంక్షన్ వద్ద అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకం జరగడంతో జనం భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం పోలీసులు నిందితుడు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన Arilova Police, ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్వల్ప గొడవకే ప్రాణాలు తీసే స్థాయికి యువత వెళ్లడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.


English Summary

A 23-year-old youth named Ajith was brutally murdered by a 26-year-old man, Kishore, following a dispute during a cricket match in Pedagadili, Visakhapatnam. The incident took place on Sunday evening, shocking the local residents of the area.

According to reports, an argument broke out between the two after the game ended. In a fit of rage, Kishore attacked Ajith with a knife at the Pedagadili junction, leading to the latter’s immediate death. The police have registered a case and reportedly taken the suspect into custody for further investigation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *