
ఈనెల 31వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా తిరుమల విఐపి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
స్వయంగా వచ్చే ప్రోటోకాల్ దర్శనాలు అంటే ప్రముఖులకు కల్పించే దర్శనాలు మాత్రం యథావిధిగా జరుగుతాయి.
31తేదీన శ్రీవారి దర్శనం కోసం 30వ తేది బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.