
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసింది. టీడీపీకి ఆయన అమ్ముడుపోయారని ఆరోపిస్తూ ఆదివారం ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో టీడీపీ నేత టీడీ జనార్ధన్‌తో విజయసాయిరెడ్డి తాడేపల్లిలోని పార్క్ విల్లాలో మార్చి 11న రహస్యంగా సమావేశమైనట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశం తర్వాతే ఆయన వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం అనుమానాస్పదమని వైసీపీ ఆరోపించింది. విజయసాయిరెడ్డి కి పార్టీ గౌరవ పదవులు ఇచ్చిందని, అయినా చంద్రబాబుకు మేలు చేసేందుకు రాజీనామా చేయడం విశ్వాస ఘాతకమని విమర్శించింది.
మార్చి 12న సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి, మీడియాతో మాట్లాడుతూ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. కాకినాడ సీ పోర్టు వాటాల లావాదేవీలో ఆయన పాత్ర ఉందని తెలిపారు. వైఎస్ జగన్‌కు ఈ వ్యవహారంతో సంబంధం లేదని పేర్కొన్నారు.