
మంచి పై చెడుకు ప్రతీక దీపావళి, చిమ్మ చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే ఈ వేడుక.. జీవితంలోనూ కొత్త వెలుగులు నింపుతుందని తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల సర్పంచ్, టీడీపీ సీనియర్ నేత బడి సుధాయాదవ్ అన్నారు.
కొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు..ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందామని అన్నారు . దీపావళి పర్వదినం సందర్భంగా పుదిపట్ల పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, సిబ్బందికి టపాకాయలు, స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంట దీపావళి వేడుకలు జరగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ఆయన వివరించారు. అందుకే తాను ప్రతి యేడు తన స్తోమత మేరకు కార్మికులకు పంపిణీ కార్యక్రమం చేపడతానని వివరించారు.