స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యం...
కన్నబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపిన వాసుపల్లి
వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ను విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కలిశారు. న్యూ ఇయర్ లో విశాఖకు మొట్టమొదటిసారిగా వచ్చిన కన్నబాబు కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, వచ్చే మార్చిలో జరిగే జీ వీ ఎం సి ఎన్నికల్లో వైసీపీ విజయం తద్యం అన్నారు. కూటమి సర్కార్ పనితీరుతో ప్రజలు విసిగిపోయారు అన్నారు. అలాగే, 50 ఏళ్ళు నిండిన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదని వాపోయారు. అలాగే, 18 ఏళ్ళు నిండిన మహిళలకు ఇస్తామన్న నగదు ఇవ్వడం లేదన్నారు. తల్లికి వందనం చాలా మందికి అందడం లేదని గుర్తు చేశారు. జగన్ పాదయాత్ర విశాఖలో విజయ వంతం చేయడంలో ఆహిర్నిషలు కృషి చేస్తామన్నారు. గతంలో కోటి సంతకాల సేకరణ దక్షిణంలో విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. విశాఖలో పార్టీ పరిస్థతి పటిష్టం అవుతోందన్నారు. అన్ని ఆందోళన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.
#VizagPolitics #YSRCP #GVMC #VasupalliGaneshKumar #KurasalaKannababu #YSJagan #Visakhapatnam #APPolitics #LocalBodyElections
