- స్పెయిన్ ప్రధానితో చర్చల సంద్భంగా మోడీ
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్యన మరెవ్వరో వచ్చి చర్చలు జరపాల్సిన అవసరం లేదని, ఆ రెండు దేశాలు కూర్చుని చర్చించుకోవాలని హితవు పలికారు. సోమవారం వడోదరాలో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో చర్చల సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
యుద్ధాలకు ఇది సమయం కాదని, వివాదాలను రణక్షేత్రంలో పరిష్కరించుకోలేమని మరోమారు చెప్పారు. ఇరు దేశాలు సంయమనం పాటించి, శాంతి బాటలు వేయాలని ఇరువురు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ తరహా ఘర్షణల్ని చర్చలు, దౌత్యపరంగానే పరిష్కరించుకోవాలని కోరారు. శాంతి స్థాపనకు రష్యా-ఉక్రెయిన్ నేరుగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. ఇజ్రా యెల్‌పై ఈ నెల 7న జరిగిన ఉగ్రదాడుల్ని నేతలు ఇద్దరూ ఖండించారు.
మౌలిక సదుపా యాలు, రైల్వే, సాంస్కృతిక, పర్యాటక రంగాలు సహా వివిధ అంశాల్లో పరస్పర సహకారానికి రెండు దేశాలూ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రైల్వేకు సంబంధించిన ప్రణాళిక రూపకల్పన, అభివృద్ధి, వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి.
సాంస్కృతిక, పర్యా టక, కృత్రిమ మేధ ఏడాదిగా 2026ను పాటించాలని నిర్ణయించుకున్నాయి. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలోని లాధీలో సోమవారం రూ.4,800 కోట్ల పనులను ప్రారంభించిన అనంతరం మోదీ ప్రసంగించారు.