
సంగీతానికి శ్రీవేణుగానమైతే, నృత్యానికి శ్రీకారం చుట్టే గమ్యం తిరుపతి. భారతీయ సాంప్రదాయ కళలకు ఆధారమైన శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరోసారి కళాభిమానులకు ద్వారాలు తెరుస్తోంది. జూన్ 2వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు తమ కలల కళలను చక్కగా మెరిపించే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల వర్గాలు పిలుపునిస్తున్నాయి.
విభిన్న కోర్సులు – సంప్రదాయానికి సమగ్ర శిక్షణ
శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వర-డోలు పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాత్రం, వీణ, వేణువు, వయోలిన్, నాదస్వరం, డోలు, భరతనాట్యం, కూచిపూడి, నృత్యం, హరికథ, మృదంగం, ఘటం తదితర విభాగాల్లో ఫుల్‌టైమ్, విశారద (డిప్లొమా), ప్రవీణ (అడ్వాన్స్డ్ డిప్లొమా) కోర్సులకు ప్రవేశాలు కలవు.
ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో ఫుల్‌టైమ్ సర్టిఫికెట్ మరియు డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జూన్ 27వ తేదీ నుండి తరగతులు ప్రారంభమవుతాయి. ఇతర ప్రాంతాల విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా కల్పించనున్నారు.
అర్హతలు – దరఖాస్తు విధానం
రెగ్యులర్ కోర్సులకు కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత, సాయంత్రం కోర్సులకు 5వ తరగతి ఉత్తీర్ణత అవసరం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50/- డిమాండ్ డ్రాఫ్ట్‌ను (ఈవో, టిటిడి పేరిట) తీసుకుని దరఖాస్తును పొందవచ్చు. మరిన్ని వివరాలకు 9440793205, 9848374408 నంబర్లను సంప్రదించవచ్చు.