April 6, 2026

Tirumala Darshan Updates : శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం!

Tirumala Update Apri 6th

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం (ఏప్రిల్ 5) సెలవు దినం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. నిన్న ఒక్కరోజే 83,271 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tirumala Darshan Updates శ్రీవారి సేవలో భాగంగా 25,018 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని సర్వదర్శనం (Sarvadarshanam) భక్తులకు శ్రీవారి దర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ నిరంతరం అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తోంది.


English Summary

Tirumala Darshan Updates The sacred hill shrine of Tirumala witnessed a significant surge in pilgrim footfall on April 5, 2026. A total of 83,271 devotees had darshan of Lord Venkateswara, with the temple administration managing the heavy weekend rush effectively.

Official reports indicate that 25,018 pilgrims fulfilled their vows through tonsuring, while the Hundi collections reached an impressive ₹3.78 crore. Currently, 20 compartments are filled, and the estimated time for Sarvadarshanam is approximately 12 hours.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *