March 23, 2026

కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి 109వ జయంతి సభ

పేద ప్రజల పక్షపాతి, రాజీలేని పోరాట యోధుడు తరిమెల నాగిరెడ్డి గారి ఆశయ సాధన కోసం ఈ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 11న  ఉదయం 10:00 గంటలకు కూడేరు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 11:00 గంటలకు కూడేరు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సభ్యులు తరిమెల రామాంజనేయులు, ఏసురత్నం, ఎర్రిస్వామి మరియు సింగనమల కమిటీ సభ్యులు లక్ష్మి, రంగయ్య, శ్రీనివాసులు, రమేష్, నాగముని, శంకర్, బాషా, మల్లప్ప, సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

“కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి వేసిన విప్లవ బాటలో నడుస్తాం.. ఆయన పట్టిన ఎర్రజెండాను తుది శ్వాస వరకు మోస్తాం. పేద ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం.” అంటూ నాయకులు నినాదాలు చేశారు.
#TarimelaNagiReddy #CommunistLeader #Anantapur #Singanamala #Kuderu #RevolutionarySpirit #PeasantsMovement #TeluguNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *