తిరుపతిలో వారిపై 49 కేసులు నమోదు
రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా బుధవారం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ పర్యవేక్షణలో తిరుపతి పట్టణ పరిధిలో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు నిర్వహించబడినవి.
ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా,
మద్యం సేవించి వాహనం నడిపిన 44 మంది వాహనదారులపై, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 05 మందిపై, మొత్తం 49 కేసులు నమోదు చేయడం జరిగింది.
వాహన తనిఖీలలో పట్టుబడిన 44 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులను గౌరవ 3వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి ముందు హాజరు పరచగా, గౌరవ న్యాయమూర్తి శ్రీమతి సంధ్యారాణి గారు వారికి శిక్ష విధించారు.
అదేవిధంగా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 05 మందికి ఒక్కొక్కరికి రూ.500/- చొప్పున జరిమానా విధించబడింది.
జరిమానా వివరాలు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: 44 మంది × రూ.10,000/- = రూ.4,40,000/-
ట్రాఫిక్ అంతరాయం కేసులు: 05 మంది × రూ.500/- = రూ.2,500/-
మొత్తం జరిమానా: రూ.4,42,500/-
మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రాణాంతకం. ఇది వాహనదారుల ప్రాణాలకు మాత్రమే కాకుండా ఇతర రోడ్డు ప్రయాణికుల ప్రాణాలకు కూడా తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుందని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.
జిల్లా ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ, పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది.
#TirupatiPolice
#DrunkAndDrive
#RoadSafety
#TrafficChecks
#DrinkAndDrive
#TrafficViolations
#LawAndOrder
#PublicSafety